అల్లు అర్జున్‌ అత్తకు ఓటు లేక నిరాశతో.. | TRS Leader Vote Miss in Hyderabad | Sakshi
Sakshi News home page

ఓటు లేక నిరాశతో..

Dec 8 2018 9:00 AM | Updated on Dec 8 2018 6:51 PM

TRS Leader Vote Miss in Hyderabad - Sakshi

ఓటు వేయడానికి వచ్చిన అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డి, అత్త అరుణ

బంజారాహిల్స్‌:  ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు ఓటు వేసేందుకు ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీకి వచ్చారు. అయితే చంద్రశేఖర్‌రెడ్డి ఓటు ఉండగా ఆయన భార్య అరుణ ఓటు గల్లంతయింది. దీంతో ఆమె నిరాశగా వెళ్లిపోయారు. ఎఫ్‌ఎన్‌సీసీలోనే ఎప్పటిలాగే ఓటు వేయడానికి వచ్చిన స్థానికురాలు డాక్టర్‌ వై.సుశీలారెడ్డి ఎప్పటిలాగే ఓటు వేయడానికి వచ్చారు. అయితే జాబితాలో ఓటు లేదని చెప్పడంతో నిరాశతో ఇంటి ముఖం పట్టారు.

బంజారాహిల్స్‌ రోడ్‌నెం. 12లోని ఎన్బీటీ నగర్‌లో పోచమ్మగుడి వెనుకాల  ఓటర్లు ఎన్బీటీ నగర్‌ స్కూల్‌లో ఓటు వేయడానిక వెళ్ళారు. అయితే వందలాది మంది ఓట్లు జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం పరిధిలోని బోరబండ పోలింగ్‌ బూత్‌లో నమోదు కావడంతో షాక్‌ తిన్నారు. ఇందులో కొంత మంది ఓపికగా అక్కడిదాకా వెళ్ళి ఓటువేశారు. ఇలా దాదాపు అన్ని పోలింగ్‌ బూత్‌లలో ఓట్లు గల్లంతు ఓటర్లను కంగుతినేలా చేసింది. తాము ఎప్పుడూ ఓటు వేస్తుంటామని ఈ సారి ఓటు ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement