‘సర్’ ముసాయిదా జాబితాలో గ్రేటర్ పరిస్థితి ఇదీ..
25 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 1.06 కోట్లు
64.75 లక్షల మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 41.80 లక్షల మంది ఓట్లు డేంజర్‌లో పడ్డాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ముసాయిదా జాబితాలో వీరు ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ) జాబితాలో ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి వీరి ఓట్లు దాదాపుగా లేనట్లే. మూడు జిల్లాల్లో మొత్తం 1,06,55,878 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 64,75,153 మంది వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. 41,80,725 మంది ఏఎస్‌డీడీ కేటగిరీల్లో ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరు 39.23 శాతం. వీరు కాక 13,83,472 మంది అనామలీస్, 23,13,150 మంది నో మ్యాపింగ్ కేటగిరీల్లో ఉన్నారు. వీరినీ కలిపితే 36,96,622 మంది వివరాలపై మరింత పరిశీలనకు అవకాశముంది. అంటే వీరి ఓట్లపై డౌట్ ఉంది.
శాశ్వత చిరునామా మార్పు ఏఎస్‌డీడీలో అత్యధికంగా 28,64,052 మంది చిరునామా శాశ్వతంగా మారిన కేటగిరీలో ఉన్నారు. ఈ 25 నియోజకవర్గాల్లో ఎక్కువమంది శాశ్వత చిరునామాలు మారాయి. తర్వాత 7,59,346 మంది అన్ ట్రేసబుల్(గుర్తించలేని)/ఆబ్సెంట్(ఇళ్లలో లేని) వారుగా, 2,96,416 మంది మృతుల, 1,94,952 మంది ఇప్పటికే వేరు ప్రాంతాల్లో ఓటర్లుగా ఉండగా, మరో 65,951 మంది ఇతరుల జాబితాలో ఉన్నారు.
అత్యధికం శేరిలింగంపల్లి..
నియోజకవర్గాల వారీగా చూస్తే శేరిలింగంపల్లిలో అత్యధికంగా 3,29,828 మంది ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నారు. ఆ తర్వాత రాజేంద్రనగర్‌లో 2,47,005, మహేశ్వరంలో 2,35,331, ఉప్పల్‌లో 2,18,323, ఎల్‌బీనగర్‌లో 2,70,284, కుత్బుల్లాపూర్‌లో 2,76,924 మంది ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్నారు. అత్యల్పంగా 85,267 మంది ఇబ్రహీంపట్నంలో ఉన్నారు.
‘నో మ్యాపింగ్’లో కుత్బుల్లాపూర్ టాప్..
కుత్బుల్లాపూర్‌లో ఏకంగా 3,00,553 మంది నో మ్యాపింగ్ జాబితాలో ఉన్నారు..తర్వాత ఉప్పల్‌లో 2,13,068, కూకట్‌పల్లిలో 2,11,703, మేడ్చల్‌లో 2,20,070, మల్కాజిగిరిలో 1,27,199 మంది ఈ కేటగిరీలో ఉన్నారు. ఈ కేటగిరిలో అత్యల్పంగా 12,481 మంది చారి్మనార్‌లో ఉన్నారు.
అనామలీస్‌లో రాజేంద్రనగర్..
అనామలీస్ కేటగిరీలో రాజేంద్రనగర్ 96,743 మందితో మొదటి స్థానంలో ఉంది. తర్వాత మహేశ్వరం 84,385, మల్కాజిగిరి 85,927, మేడ్చల్ 76,175, కుత్బుల్లాపూర్‌లో 72,973 మంది ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యల్పంగా 27,878 మంది ఈ కేటగిరీలో ఉన్నారు.
మహేశ్వరంలో మృతులెక్కువ..
ఏఎస్‌డీడీలోని మృతుల్లో మహేశ్వరం 16,835 మందితో మొదటి స్థానంలో ఉంది. తర్వాత మేడ్చల్ 15,898, రాజేంద్రనగర్ 14,824, ఉప్పల్ 14,922, గోషామహల్ 13,237, కుత్బుల్లాపూర్ 13,733గా ఉన్నాయి. అత్యల్పంగా సనత్‌నగర్‌లో 4,172 మంది మృతుల కేటగిరీలో ఉన్నారు.
శేరిలింగంపల్లిలో అన్‌ట్రేసబుల్..
అన్‌ట్రేసబుల్, ఆబ్సెంట్ కేటగిరీలో శేరిలింగంపల్లి 86,793 మందితో ముందుంది. తర్వాత ఎల్‌బీనగర్ 86,609, రాజేంద్రనగర్ 83,491, కుత్బుల్లాపూర్ 68,293, బహదూర్‌పురా 27,294గా ఉన్నాయి. అత్యల్పంగా మలక్‌పేటలో 3,718 మంది ఉన్నారు. శాశ్వతంగా చిరునామా మారిన వారిలోనూ 2,16,933 మందితో శేరిలింగంపల్లి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత మహేశ్వరం 1,70,613, ఎల్‌బీనగర్ 1,58,129, మేడ్చల్ 1,56,016, రాజేంద్రనగర్ 1,32,063, కూకట్‌పల్లి 1,22,906 మంది ఉన్నారు. అత్యల్పంగా చారి్మనార్‌లో 42,238 మంది మాత్రమే నమోదయ్యారు.
ఖైరతాబాద్‌లో ఇతరులెక్కువ
ఇతరుల కేటగిరీలో ఖైరతాబాద్ 11,658 మందితో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చాంద్రాయణగుట్ట 8,264, మహేశ్వరం 9,425, ముషీరాబాద్ 1,644 తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యల్పంగా చార్మినార్‌లో 99 మంది ఉన్నారు.
ఇప్పటికే నమోదులో.. మహేశ్వరం
ఇప్పటికే మరోచోట అంటే ఇతర రాష్ట్రాలు, నగరాలు, తదితర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైనవారిగా గుర్తించిన కేటగిరీలో మహేశ్వరం 19,758 మందితో ముందుంది. తర్వాత రాజేంద్రనగర్ 14,269, ఇబ్రహీంపట్నం 13,964, మేడ్చల్ 12,363, యాకుత్‌పురా 11,860 ఉన్నాయి. అత్యల్పంగా మల్కాజిగిరిలో 2,714 మంది ఉన్నారు.
ఇంకా అవకాశం ఉంది..
అనామలీస్, నోమ్యాపింగ్‌తో పాటు ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్నవారు తగిన వివరాలు సమరి్పస్తే వారి ఓటు ఉంటుందని అధికారులు తెలిపారు.
25 నియోజకవర్గాల్లో ఇలా...


