ఏరుదాటుతుండగా వ్యక్తి గల్లంతు | the person reported missing in heavy rains | Sakshi
Sakshi News home page

ఏరుదాటుతుండగా వ్యక్తి గల్లంతు

Nov 10 2015 3:37 PM | Updated on Oct 20 2018 6:04 PM

దక్కిలి మండలం కందల వారిపల్లి వద్ద మంగళ వారం బైక్ పై ఏరు దాటుతుండగా.. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు

భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఏర్లు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా.. దక్కిలి మండలం కందల వారిపల్లి వద్ద మంగళ వారం బైక్ పై ఏరు దాటుతుండగా.. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి దక్కిలి మండలం రాపూర్ గ్రామానికి చెందిన సి. వేణుగోపాల్ రెడ్డి(36)గా గుర్తించారు. దక్కిలి సబ్ స్టేషన్ లో స్విచ్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వేణుగోపాలు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా..ఈ  విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి అధికారులు వచ్చినా.. భారీ వర్షం కురుస్తుండటంతో.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.



 

Advertisement
 
Advertisement
Advertisement