శబరిమలకు ప్రత్యేక రైళ్లు | SCR Announces Sabarimala Special Trains | Sakshi
Sakshi News home page

Nov 7 2018 8:45 AM | Updated on Nov 7 2018 8:48 AM

SCR Announces Sabarimala Special Trains - Sakshi

అయ్యప్ప భక్తుల కోసం విశాఖపట్నం–కొల్లం–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ డివిజన్‌ ప్రకటించింది.

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం విశాఖపట్నం–కొల్లం–విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ పీఆర్వో జేవీ ఆర్కే రాజశేఖర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రైలు నెంబరు (08515) ప్రత్యేక రైలు నవంబర్‌ 17, 20, 24, 27, డిసెంబర్‌ 1, 4, 8, 15, 22, 25, జనవరి 5, 12, 15 తేదీలలో రాత్రి 11.15కు విశాఖపట్నంలో బయలుదేరి రెండోరోజు ఉదయం 7 గంటలకు కొల్లం చేరుతుంది. రైలు నెంబరు (08516) ప్రత్యేక రైలు నవంబర్‌ 19, 22, 26, 29, డిసెంబర్‌ 3, 6, 10, 17, 24, 27, జనవరి 7, 14, 17 తేదీలలో ఉదయం 10 గంటలకు కొల్లంలో బయలుదేరి మరుసటిరోజు సా. 6.30కు విశాఖ చేరుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement