వీరభద్రస్వామి ఆలయంలో చోరీ | robbery in temple at kurnool district | Sakshi
Sakshi News home page

వీరభద్రస్వామి ఆలయంలో చోరీ

Oct 14 2015 8:50 AM | Updated on Aug 30 2018 5:27 PM

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది.

కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వీరభద్రస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వీరభద్రస్వామి విగ్రహంపై ఉన్న బంగారు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 3 కేజీల వెండి, 12 గ్రాముల బంగారు నగలను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్ తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement