కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన | Rains forecast to coastal Andhra | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

Sep 15 2014 5:32 PM | Updated on Sep 2 2017 1:25 PM

వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

హైదరాబాద్: వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. బంగాళాఖాతంలో రేపటిలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం వ్యాపించవచ్చు. ఒడిశా, వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశముంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement