‘బిడ్డను కేజీహెచ్‌కు తీసుకువెళ్లం’ | Parents Rejects KGH Treatment For His Child In Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘బిడ్డను కేజీహెచ్‌కు తీసుకువెళ్లం’

Jun 6 2018 1:31 PM | Updated on Jun 6 2018 1:31 PM

Parents Rejects KGH Treatment For His Child In Visakhapatnam - Sakshi

వైద్య సేవలు అందిస్తున్న లంగుపర్తి వైద్య సిబ్బంది

అనంతగిరి: అప్పుడే పుట్టిన బిడ్డ శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నా కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. మండలంలోని లంగుపర్తి పీహెచ్‌సీలో మల్లేపాడు గ్రామానికి చెందిన బీసాయి సన్యాసమ్మ మంగళవారం మూడో బిడ్డకు జన్మనించింది. జన్మించిన కుమారుడు శ్వాస సమస్యతో బాధపడుతున్నాడని, పీహెచ్‌సీ సిబ్బంది చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని గమనించి వెంటనే ఆ బిడ్డను విశాఖ కేజీహెచ్‌కు తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. అయితే అందుకు వారు నిరాకరించి గ్రామానికి తీసుకుని వెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement