రెంటచింతల పెద్దకాలువ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Sep 21 2013 4:13 AM | Updated on Aug 30 2018 3:56 PM
రెంటచింతల, న్యూస్‌లైన్ : రెంటచింతల పెద్దకాలువ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ వెంకట సురేష్ కథనం ప్రకారం.. గురజాలకు చెందిన మాచర్ల సైదులు తన స్నేహితుడితో కలసి రెంటచింతల నుంచి ద్విచక్రవాహనంపై తన గ్రామానికి వెళుతున్నారు.
అదేసమయంలో రెంటచింతలకు లిక్కర్ లోడ్‌తో వస్తున్న లారీని పెద్దకాలువ సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సైదులు అక్కడికక్కడే మృతిచెందాడు. వెనక కూర్చున్న అతని స్నేహితుడు బొల్లా రామారావు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనం వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. గాయపడిని వ్యక్తిని 108లో గురజాల ఆసత్రికి తరలించారు.
అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో సైదులు తల పూర్తిగా తెగి మొండేనికి 50 అడుగుల దూరంలో పడింది. కుడి కాలు విరిగింది. సైదులు గురజాల తహశీల్దార్ కార్యాలయం సమీపంలో బార్బర్ షాపు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement


