రెవెన్యూ అధికారులకు నోటీసులు | Notices revenue authorities | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అధికారులకు నోటీసులు

Apr 24 2016 1:47 AM | Updated on Sep 3 2017 10:35 PM

సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం సకాలంలో సక్రమంగా ఇవ్వనందున తెర్లాం తహశీల్దార్ యు.రాజకుమారికి,

 తెర్లాం రూరల్ : సమాచార హక్కు చట్టం కింద  అడిగిన సమాచారం సకాలంలో సక్రమంగా ఇవ్వనందున తెర్లాం తహశీల్దార్ యు.రాజకుమారికి, పార్వతీపురం ఆర్డీఓ ఆర్.గోవిందరావుకు సమాచార హక్కు చట్టం కమిషనర్ నుంచి నోటీసులు అందాయని ఫిర్యాదుదారుడు కె.ధనప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పెరుమాళి గ్రామానికి చెందిన సర్వే  నంబర్ 29లో గల యర్ర చెరువులోని అక్రమణదారుల వివరాలు కావాలని కోరగా, సరైన వివరాలు అందివ్వలేదన్నారు. దీంతో తాను సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో ఆయన ఈ నెల 29న జెడ్పీ సమావేశ మందిరంలో చేపట్టననున్న విచారణకు హాజరుకావాలని తనతో పాటు తహశీల్దార్, ఆర్డీఓలకు నోటీసులు పంపించారని చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement