రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి | mother and son dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి

Feb 21 2015 7:19 PM | Updated on Apr 3 2019 8:07 PM

అనంతపురం జిల్లా రాప్తాడులో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం తల్లి కొడుకులు మృతి చెందారు.

రాప్తాడు (అనంతపురం): అనంతపురం జిల్లా రాప్తాడులో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం తల్లి కొడుకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. రాప్తాడు మండలంలోని హంపాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ నారయణమ్మ(35), తన కుమారుడు దినేశ్(15)తో కలిసి ద్విచక్రవాహనంపై పొలానికి వెళుతుండగా, బెంగుళూరు వైపు వెళ్లే కారు వీరిని ఢీకొట్టింది.

దీంతో తీవ్రగాయాలైన బాధితులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement