‘వారిద్దరూ రాజకీయ వ్యాపారులు’ | Minister Avanthi Srinivas Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు పని

May 26 2020 11:51 AM | Updated on May 26 2020 12:02 PM

Minister Avanthi Srinivas Fires On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యాపారులని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే కనిపించడం లేదని, హ్యాండ్‌ కర్ఛీఫ్‌ మార్చినట్లు.. పార్టీ మార్చే వ్యక్తి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అని ఎద్దేవా చేశారు. రెండు నెలల పాటు తెలంగాణలో మనవడితో ఆడుకున్న చంద్రబాబుకు స్వాగతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఏం ఘన కార్యం చేశారంటూ మంత్రి అవంతి మండిపడ్డారు.
(‘కూన’ కోసం గాలింపు) 

అభివృద్ధిని అడ్డుకోవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాలు తగ్గిస్తే బ్రాండ్‌లు అమ్మడం లేదంటూ ఆయన రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదాయం కోసం జనానికి చంద్రబాబు మందు పోయించారని విమర్శించారు. కేరళకు మించిన అక్షరాస్యత కోసం అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేను గెలిపించకపోయినా విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.
(వెంకన్న సాక్షిగా.. పాపాలన్నీ బాబువే)

Advertisement
 
Advertisement
Advertisement