వైఎస్సార్ జిల్లా వాసి జడ్చర్లలో ఆత్మహత్య | man committed suicide | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ జిల్లా వాసి జడ్చర్లలో ఆత్మహత్య

Mar 12 2015 5:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

జడ్చర్ల :మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన గజ్జల చెన్నకేశవ రెడ్డి(40) అనే వ్యక్తి గురువారం గుర్తు తెలియని రైలు కింద పడి, బలవన్మరణం చెందాడు. సంఘటన స్థలంలో అతని ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా అతనిని పులివెందులలోని ఎస్‌బీ కాలనీకి చెందిన వాడని గుర్తించారు.

 

అతని వద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement