ఇడుపులపాయ: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు | YSR 77th Jayanthi 2026, Ys Jagan Pays Tribute To YSR At Idupulapaya With His Family And Party Leaders, Watch Video Inside | Sakshi
Sakshi News home page

YSR Jayanthi 2026: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

Jul 8 2026 8:07 AM | Updated on Jul 8 2026 9:48 AM

Ysr Jayanthi 2026: Ys Jagan Pays Tribute To Ysr At Idupulapaya

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
 

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్సార్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement