breaking news
tarin
-
మంచి మనసు చాటుకున్న అదానీ ... వారందరికీ ఉచిత విద్య
-
ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించిన స్టార్ హీరోయిన్
సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. జనాల కంట పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తాజాగా స్టార్ కిడ్ సారా అలీఖాన్ మాత్రం ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించి ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వీడియోను సైతం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది 'సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో తన టీంతో కలిసి ఇలా లోకల్ ట్రైన్లో ప్రయాణం చేశాను' అంటూ సారా తన ఇన్స్టా వీడియోలో చెప్పుకొచ్చింది. ట్రైన్ దిగిన తర్వాత కూడా సారా ఆటోలో ప్రయాణంచడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
వైఎస్సార్ జిల్లా వాసి జడ్చర్లలో ఆత్మహత్య
జడ్చర్ల :మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన గజ్జల చెన్నకేశవ రెడ్డి(40) అనే వ్యక్తి గురువారం గుర్తు తెలియని రైలు కింద పడి, బలవన్మరణం చెందాడు. సంఘటన స్థలంలో అతని ఓటరు గుర్తింపు కార్డు ఆధారంగా అతనిని పులివెందులలోని ఎస్బీ కాలనీకి చెందిన వాడని గుర్తించారు. అతని వద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.