కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య | Man commits Suicide | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Jul 4 2015 5:26 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బేతంచర్ల (కర్నూలు జిల్లా) : కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం సీతారామాపురం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. సీతారామాపురం గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య(38) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొంతకాలంలో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కుటుంబకలహాలు జరుగుతుండటంతో మనస్తాపం చెందాడు.

ఈ క్రమంలోనే శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మీదేవితో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement