బంగారానికి మెరుగుపెడతామని.. | gold robbery in guntur district | Sakshi
Sakshi News home page

బంగారానికి మెరుగుపెడతామని..

Mar 11 2016 1:58 PM | Updated on Aug 24 2018 2:36 PM

బంగారానికి మెరుగుపెడతామని చెప్పి బంగారం దోచుకున్న సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది.

ముప్పాళ్ల : బంగారానికి మెరుగుపెడతామని చెప్పి బంగారం దోచుకున్న సంఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు వచ్చి బంగారం మెరుగు పెడతామనడంతో తన దగ్గర ఉన్న 8  సవర్ల బంగారాన్ని ఇచ్చానని..చూసుకునే లోపలే దుండగులు పరారైనట్టు బాధితురాలు సరసమ్మ తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ముప్పాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


 

Advertisement
 
Advertisement
Advertisement