'బాబు గజదొంగ అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి' | Gandra venkata ramana reddy takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'బాబు గజదొంగ అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి'

Mar 6 2014 12:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

'బాబు గజదొంగ అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి' - Sakshi

'బాబు గజదొంగ అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చంద్రబాబు రెండుసార్లు ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే టీడీపీ ప్రజలు ఎందుకు ఓడించారని అన్నారు. పలు అవినీతి కుంభకోణాలు తప్ప, చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని గండ్ర విమర్శించారు.

దేశంలో అత్యంత ధనిక నేత చంద్రబాబు నాయుడు అంటూ పదేళ్ల క్రితమే మీడియా సంస్థలు ప్రకటించాయని గండ్ర తెలిపారు. చంద్రబాబు గజదొంగ అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష హోదా కూడా దక్కదని గండ్ర జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల్లో డబ్బు సంప్రదాయాన్ని, ఓటుకు నోటు విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడేనని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement