పత్తి రైతు ఆత్మహత్య | farmer suicide in guntur distirict | Sakshi
Sakshi News home page

పత్తి రైతు ఆత్మహత్య

Jul 29 2015 9:02 AM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో ఓ పత్తి రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

వెల్దుర్తి (గుంటూరు): అప్పుల బాధతో ఓ పత్తి రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన రైతు ఎం.రాముడు (40) మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి అతడు విగతజీవిగా కనిపించాడు. రాముడు తనకున్న పొలంతోపాటు పక్క గ్రామంలోనూ ఆరెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా నష్టాలు వస్తుండడంతో చేసిన అప్పు రూ.10 లక్షలకు చేరిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల బాధతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వారు విలపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement