
సాక్షి, తిరుపతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బినామీలే ఇప్పుడు అమరావతిలో నిరసనలు చేస్తున్నారని చిత్తూరు ఎంపీ రెడప్ప విమర్శించారు. సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. జిఎన్ రావు కమిటీ నివేదికను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను గాలికి వదిలేశారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని అన్నారు.
ఆస్తులను కాపాడుకోవడానికే.. ఆస్తులను కాపాడుకోవడానికే చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు నానా యాగీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, జంగాలపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అమరావతిలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు. సీఎం జగన్‌కు మంచిపేరు వస్తోందని చంద్రబాబు వణికిపోతున్నారన్నారు. వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన హర్షణీయమన్నారు.