అవినీతి ప్రభుత్వం నుంచి వైదొలగండి | Chandrababu Naidu government corruption | Sakshi
Sakshi News home page

అవినీతి ప్రభుత్వం నుంచి వైదొలగండి

Nov 6 2015 2:08 AM | Updated on Mar 28 2019 8:37 PM

చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారని,

తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారని, అటువంటప్పుడు ఆయన ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకుని, వెంటనే వైదొలగాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జి హితవు పలికారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, డ్వాక్రా మహిళలను అడ్డం పెట్టుకుని మంత్రులు, ఎమ్మెల్యే ఇసుక కుంభకోణాలకు పాల్పడుతూ దోచుకుంటున్నారని ఆరోపణలు చేసిన విషయూన్ని ఆయన గుర్తుచేశారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ, టీడీపీ కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement