కేసీఆర్‌ ఒక్క కేసు పెడితే.. నేను నాలుగు పెడతా: చంద్రబాబు | Chandrababu Naidu FIres On Telangana CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఒక్క కేసు పెడితే.. నేను నాలుగు పెడతా: చంద్రబాబు

Dec 30 2018 2:33 PM | Updated on Dec 30 2018 7:42 PM

Chandrababu Naidu FIres On Telangana CM KCR - Sakshi

సాక్షి, అమరావతి: తాను తలాతోక లేకుండా మాట్లాడుతున్నాని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్‌ పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే తాము కాంగ్రెస్‌తో కలిశామన్న చంద్రబాబు.. గతంలో తాను ఎన్టీఆర్‌ నుంచి టీడీపీని లాక్కున్నప్పుడు కేసీఆర్‌ కూడా తనతోనే ఉన్నారని, ఆ తర్వాతనే ఆయన మంత్రి అయ్యారని బాబు అన్నారు. 

కేసీఆర్‌ బెదిరించడానికి యత్నిస్తున్నారని, అందుకు తానేమీ భయపడే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ కేసీఆర్‌ ఒక్కకేసు పెడితే తాను నాలుగు కేసులు పెడతానన్నారు. బంగారు గుడ్లుపెట్లే తెలంగాణను వదిలేసినప్పటికీ తనపై కేసీఆర్‌ అక్కసు వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు. తనను చెత్త పొలిటీషియన్‌ అని, కాంగ్రెస్‌ నాయకులును ఇడీయట్స్‌ అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్‌ఎస్‌ పొత్తు కోసం అడిగానని, ఇద్దరం కలిసి పని చేద్దామని అన్నానన్నారు. అందులో తప్పేముందని చంద‍్రబాబు ప్రశ్నించారు. 

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి తీరతాం

Advertisement
 
Advertisement
Advertisement