'అక్రమాలు జరిగితే సహించవద్దు' | chandrababu held teleconference | Sakshi
Sakshi News home page

'అక్రమాలు జరిగితే సహించవద్దు'

Jan 9 2016 9:18 AM | Updated on Jul 28 2018 3:23 PM

సంక్రాంతి చంద్రన్న కానుక పంపిణీలో అక్రమాలు జరిగితే సహించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

విజయవాడ: సంక్రాంతి చంద్రన్న కానుక పంపిణీలో అక్రమాలు జరిగితే సహించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం చంద్రబాబు.. 8 వేల మంది అధికారులు, ఉద్యోగులతో  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

సంక్రాంతి కానుక సరుకుల్లో నాణ్యత లేకుంటే ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటుందని చంద్రబాబు అన్నారు. ఇది ప్రతిష్టాత్మక కార్యక్రమమని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని అధికారులకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement