చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు.. | Amaravathi JAC Meets YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన జేఏసీ నేతలు

Jan 7 2020 6:46 PM | Updated on Jan 7 2020 7:08 PM

Amaravathi JAC Meets YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం అమరావతి  జేఏసీ నేతలు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు. పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హెల్త్‌ కార్డులు పూర్తిస్థాయిలో అమలు జరగడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లామని.. వెంటనే నివేదికలు తెప్పించాలని సీఎం అధికారులను ఆదేశించారని బొప్పరాజు తెలిపారు. ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, ఆయనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాలను చావ చచ్చారా అని మాట్లాడటం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బొప్పరాజు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement