54 ద్విచక్ర వాహనాలు స్వాధీనం | 54 bikes Possession by kuppam police | Sakshi
Sakshi News home page

54 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

Oct 28 2015 11:40 AM | Updated on Aug 20 2018 4:27 PM

జల్సాల కోసం ద్విచక్ర వాహనాలను కొట్టేస్తున్న ముఠా ఆటకట్టించారు చిత్తూరు జిల్లా పోలీసులు.

కుప్పం: జల్సాల కోసం ద్విచక్ర వాహనాలను కొట్టేస్తున్న ముఠా ఆటకట్టించారు చిత్తూరు జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది సభ్యుల ముఠా బెంగళూరు నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగలించి వాటిని కుప్పంకు తరలించేవారు. కుప్పంలో వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎనిమిది మంది దొంగలను బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 54 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement