ఏపీలో 41 మంది డీఎస్పీల బదిలీ | 41 DSPs transferred in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 41 మంది డీఎస్పీల బదిలీ

Feb 17 2020 9:58 AM | Updated on Feb 17 2020 10:15 AM

41 DSPs transferred in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 41మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 41మంది డీఎస్పీల బదిలీల్లో 37మంది వెయింటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇవ్వగా, మరో నలుగురిని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పోస్టింగ్‌లు ఇచ్చినవారిలో ఆరుగురు సీఐడీ విభాగానికి, ఒకరు ఏసీబీకి, ఇద్దరు ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోస్టులను కేటాయించారు. చిత్తూరు ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎస్‌ఆర్‌ వంశీధర్‌గౌడ్‌, కర్నూలు డీటీసీ పీఎన్‌ బాబు, రాజమండ్రి డీటీసీ ఆర్‌.సత్యనారాయణ, రాజమండ్రి డీఎస్‌ఆర్‌పీ ఎస్‌.మనోహర్‌రావులను పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement