ఆటోను ఢీకొన్న బస్సు:నలుగురి మృతి | 4 killed, 6 injured as bus hits autorickshaw | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న బస్సు:నలుగురి మృతి

Jul 17 2014 3:30 PM | Updated on Apr 3 2019 7:53 PM

జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెంది నఓ ఆర్టీసీ బస్సు ఆదోని వద్ద ఆటో రిక్షాను ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

కర్నూలు:జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెంది నఓ ఆర్టీసీ బస్సు ఆదోని వద్ద ఆటో రిక్షాను ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  కర్ణాటక నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా వారిలో మహిళలు ముగ్గురున్నారు. అయితే మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

ఈ రోజు ఉదయం 11గం.ల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆటో రిక్షాలో ఆదోని గ్రామ ప్రయాణికులు అదే గ్రామానికి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement