వైఎస్సార్ సీపీలో 150 మంది చేరిక | 150 members join YSR Congress party at Jaggampeta | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో 150 మంది చేరిక

Feb 16 2014 12:55 AM | Updated on May 25 2018 9:12 PM

మండలంలోని జె.కొత్తూరు గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు శనివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 జె.కొత్తూరు (జగ్గంపేట), న్యూస్‌లైన్ : మండలంలోని జె.కొత్తూరు గ్రామానికి చెందిన 150 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు శనివారం  రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ వైఎస్సార్ సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ర్టంలో సుస్థిర పాలన సాధ్యమవుతుందన్నారు.  పిల్లలకు ఉన్నత చదువులకు అమ్మఒడి, వికలాంగ, వితంతు పింఛన్ల పెంపు తదితర పథకాలను అధికారంలోకి రా గానే అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఏకమై తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తున్నాయన్నారు.
 
 రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. గ్రామంలోని చిన్నయ్యపేట, దళితవాడ, ఈబీసీ కాలనీ వా సులు అధికసంఖ్యలో వైఎస్సా ర్ సీపీలో చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ కందికట్ల సింగరమ్మ, కందికట్ల వెంకటరావు, అడపా పుల్లారావు, రాంబాబు, వనెం సుబ్బారావు, నొక్కు చంద్రరావు, నకిరెడ్డి వీర్రాజు, సూరన్న, రాజు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో జంపన సీతారామ స్వామి, జనపరెడ్డి సుబ్బారావు, అత్తులూరి నాగబాబు, జీను మణిబాబు, పైడిపాల సూరిబాబు, భూపాలపట్నం ప్రసాద్, వెలిశెట్టి శ్రీను, చల్లా రామ్మూ ర్తి, అడపా నాయుడు, చింతల  తాతబ్బాయి, గంటా పకీర్, కేసుబోయిన లోవరాజు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement