ఆర్టీసీ, లారీ ఢీ: 15 మందికి గాయాలు | 15 people injured in bus accident at Guntur district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ, లారీ ఢీ: 15 మందికి గాయాలు

Nov 2 2013 10:23 AM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం ఎర్రవాగు బ్రిడ్జి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది.

గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం ఎర్రవాగు బ్రిడ్జి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వేళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. దాంతో 108 వాహనంలో క్షతగాత్రులను పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. లారీ డ్రైవర్ వేగమే ప్రమాదానికి కారణమని ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్ నుంచి గుంటూరు వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఆ దుర్ఘటన చోటు చేసుకుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement