లారీ ఢీకొని విద్యార్థి మృతి | 12 years old boy deid in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని విద్యార్థి మృతి

Aug 1 2015 12:28 PM | Updated on Nov 9 2018 5:02 PM

అతి వేగంగా వెళ్తున్న లారీ పాఠశాలకు వెళ్తున్న ఓ బాలున్ని ఢీకొట్టింది.

తెర్లాం: అతి వేగంగా వెళ్తున్న లారీ పాఠశాలకు వెళ్తున్న ఓ బాలున్ని ఢీకొట్టింది. దీంతో బాలుడు లారీ వెనక చక్రాల కింద నలిగిపోయాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాలి జంక్షన్ దగ్గర శనివారం ఉదయం జరిగింది. వివరాలు.. తెర్లాం మండలం జగన్నాధవలస గ్రామానికి చెందిన చౌడవాడ కామేశ్వర్రావు(12) పెరుమాళి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సైకిల్‌పై పాఠశాలకు వెళ్తున్న  బాలుడు పెరుమాళి జంక్షన్ వద్దకు చేరుకోగానే రాజాం నుంచి రామభద్రాపురం వె ళ్తున్న లారీ సైకిల్‌ను ఢీకొట్టింది.

దీంతో లారీ కింద పడిపోయిన కామేశ్వర్రవు పై నుంచి లారీ వెనక చక్రాలు పోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్తున్న బాలుడు ప్రమాదానికి గురయ్యాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement