ఏపిలో 12మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ | 12 Municipal Commissioners Transferred In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో మున్సిపల్‌ ఉన్నతాధికారుల బదిలీ

Jan 17 2020 8:49 PM | Updated on Jan 17 2020 9:16 PM

12 Municipal Commissioners Transferred In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్‌ ఉన్నతాధికారులను పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఆర్‌ఎండీఏ జి.శ్రీనివాసరావును రాష్ట్ర మున్సిపల్‌ కమిషరేట్‌లో జాయింట్‌ డైరెక్టరేట్‌గా బదిలీ చేశారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌ కె.వెంకటేశ్వర్లును గుంటూరు మున్సిపల్‌కార్పోరేషన్‌ ఆర్‌ఎండీఏగా నియమించారు. అదే విధంగా రాష్ట్రంలో పలువురు మున్సిపల్‌ కమిషనర్లు, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్లు,ఇతర అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement