breaking news
-
పక్కా కుట్రతోనే టీడీపీ నేతల దాడులు.. డీజీపీకి సాక్షి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా తమ కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు తెగపడుతుండడంపై సాక్షి మీడియా సంస్థ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం ఉదయం సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి ఫిర్యాదు అందజేసింది. ఏపీలో సాక్షి యూనిట్‌తోపాటు ప్రాంతీయ కార్యాలయాలపై టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు జరిపిన దాడులు.. ఆస్తులు విధ్వంసం తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సాక్షి ప్రతినిధుల బృందం కోరింది. తద్వారా రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలని తెలిపింది. మహిళలు, బాలికలతో పాటు అన్ని వర్గాల పట్ల సాక్షి మీడియా పూర్తి గౌరవంతో వ్యవహరిస్తోందని, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను సాక్షి మీడియా సమర్థించదని, పక్కా కుట్రతోనే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీకి స్పష్టం చేసింది. కార్యాలయాలపై దాడికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించాలని ఆయన్ని సాక్షి బృందం కోరింది.ఏపీ పోలీస్ హెడ్క్వార్టర్స వద్ద సాక్షి ప్రతినిధుల బృందం -
పచ్చని జీవితాల్లో మద్యం చిచ్చు
కోరుకొండ: తాగిన మత్తులో కొంతమంది వ్యక్తులు స్నేహితుడినే అంతమొందించారు. ఈనెల 4న జరిగిన ఈ హత్య కేసు మిస్టరీని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ కథనం మేరకు... కోరుకొండ మండలం గాడాల–నిడిగట్ల రోడ్డులోని ఓ వెంచర్ డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హతుడిని రాజమహేంద్రవరం రూరల్ వెంకట నగరం గ్రామానికి చెందిన కొవ్వాడ చిన్నబ్బులు (31)గా పోలీసులు గుర్తించారు. చిన్నబ్బులుకు రాజమహేంద్రవరానికి చెందిన డీజే సాయి, శెట్టి వీరబాబు, కర్రి శ్రీనివాసరెడ్డి, రేలంగి తరుణ్‌సాయి, ఆకుల గణేశ్ స్నేహితులు. తరచుగా కలుసుకుని మద్యం తాగుతుంటారు. ఈనెల 4న ఉదయం మద్యం తాగుతున్న సమయంలో వీరబాబు సెల్‌ఫోన్ చిన్నబ్బులు తీసుకోగా, కింద పడి పగిలిపోయింది. దీంతో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు బెదిరించుకున్నారు. సమస్య పరిష్కరించుకుందామని అదే రోజు రాత్రి చిన్నబ్బులును పిలిచారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఐదుగురూ చిన్నబ్బులు గొంతును పదునైన బ్లేడ్‌తో కోసి, బండరాయితో మోది హత్య చేశారు. నిందితులను పోలీసులు రాజమహేంద్రవరం సీతంపేటలోని ఓ ఇంట్లో అరెస్టు చేశారు. వారికి ఆశ్రయమిచి్చన గండిమేను సుదర్శన్, నిఖితలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రెండు మోటార్ సైకిళ్లు, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు, ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నారు.తండ్రి హతం మద్యం తాగి ఇంట్లో గొడవ.. కొడుకులపై దాడిఎదురు దాడి చేసిన పెద్ద కుమారుడు తోట్లవల్లూరు: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో కొడుకు చేతిలో తండ్రి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని చాగంటిపాడు గ్రామానికి చెందిన నిమ్మకూరి ఆనంద్ (43) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య సుపధ, కుమారులు వాసు, భార్గవ్ ఉన్నారు. వాసు కార్ల షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. భార్గవ్ డిగ్రీ చదువుకుంటూ విజయవాడలో ఉంటున్నాడు. తనకు తెలియకుండా భార్య ఇంటిపై రూ.5లక్షలు అప్పు తెచ్చినట్టు ఆనంద్‌కు తెలిసింది. ఈక్రమంలో సోమవారం మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆనంద్ తల్లి వెంకటేశ్వరమ్మ ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. తండ్రి మద్యం తాగి వచ్చి గొడవచేస్తున్న విషయాన్ని సుపధ కొడుకులు చెప్పింది. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న కొడుకులతో కూడా ఆనంద్ గొడవకు దిగాడు. రాడ్‌తో పెద్ద కొడుకు వాసుపై దాడి చేయటంతో కింద పడిపోయాడు. వెంటనే వాసు చేతికి దొరికిన చెక్కతో దాడి చేశాడు.కోపంలో రాడ్‌తో కూడా కొట్టడంతో తలకు బలమైన గాయాలై ఆనంద్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, తోట్లవల్లూరు ఎస్ఐ అవినాశ్ మంగళవారం వివరాలను సేకరించారు. మృతుని తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారకుడైన వాసుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.యువకుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): మద్యానికి బానిస కావడంతో, భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని జాకీర్‌హుస్సేన్ నగర్లో మంగళవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. రబ్బాని (30), మముల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రబ్బాని తన ఇంటి పక్క వీధిలో టిఫిన్ అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన రబ్బాని భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో దంపతుల నడుమ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 8న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో భర్తపై అలిగి మముల తన ఇద్దరు పిల్లలను తీనుకుని శ్రీనివాసగనర్లోని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రబ్బాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితుడు అక్బర్ అలియాస్ ఇక్బాల్ ఫోన్ చేసి మములాకు తెలిపారు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. బాధితురాలు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
ఎంత పని చేశావు తల్లి!
చాగలమర్రి(నంద్యాల): ఇద్దరు చిన్నారులు.. ఒకరికి నాలుగేళ్లు, మరొకరికి ఏడేళ్లు.. తండ్రి అకాల మరణం చెందారు. ఇక పిల్లల భారమంతా ఆ తల్లిదే. కుమార్తెల ఆలనా..పాలనా చూసుకోవాల్సిన ఆమె మనోవేదనతో తీసుకున్న నిర్ణయం ఇద్దరి పిల్లలను అనాథగా మార్చేసింది. భర్త లేని లోకంలో తాను ఉండలేనంటూ ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మండల కేంద్రం చాగలమర్రిలో చోటు చేసుకుంది. స్థానిక న్యూ బిల్డింగ్స్ కాలనీలోని రోసిరెడ్డి రైస్ మిల్ వీధిలో నివాసం వుంటున్న పవన్ కుమార్(40) నిత్యావసర వస్తువుల ఏజెన్సి నిర్వహిస్తూ 40 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతని భార్య మహేశ్వరమ్మ(30) ఇద్దరు కుమార్తెలు జాహ్నవి (7), హర్షిత (4)తో కలసి తండ్రి కృష్ణమూర్తి చెంత ఉంటోంది. కృష్ణమూర్తికి మతిస్థిమితం లేదు. కొన్నాళ్ల క్రితం అతని భార్య కూడా మృతి చెందింది. మరో వైపు పవన్ కుమార్ తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. అటు భర్త తరఫు, ఇటు తన తరఫు అండగా నిలవాల్సిన ఎవరూ లేకపోవడంతో భర్త చనిపోయినప్పటి నుంచి మహేశ్వమరమ్మ తీవ్ర ఆందోళన చెందింది. చివరకు మనోవేదనతో ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఓ గదిలోకి వెళ్లి నిప్పంటించుకుంది. ఇంట్లో మంటలు కనిపించడం, పెద్దగా కేకలు రావడంతో ఇరుగు పొరుగున ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ సురేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంటి లోపల వైపు గడియ పెట్టి ఉండటంతో ఇంటిపై నుంచి పోలీసులు లోపలికి ప్రవేశించి సోఫాలో నిద్రిస్తున్న పిల్లలిద్దరిని, ఆమె తండ్రిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మహేశ్వరమ్మ పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. తల్లి మృతితో రోదిస్తున్న చిన్నారులను చూసి పలువురు కంట తడి పెట్టారు. ప్రస్తుతం దూరపు బంధువు వద్ద ఆ చిన్నారులు ఉన్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏపీలో ఘోరం: కడుపులో బిడ్డ ఉంది.. కొట్టొద్దన్నా..!
తాడేపల్లి రూరల్ : అసలే అర్ధరాత్రి.. ఆపై మద్యం మత్తు.. దీనికితోడు నేర చరిత్ర ఉన్న యువకులు.. మహిళ కనిపించగానే ఉన్మాదులుగా మారారు.. ఆమెపై దాడికి దిగారు.. గర్భంతో ఉన్నానని చెప్పినా వినకుండా పైశాచికంగా ప్రవర్తించారు..! తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి పాత జాతీయ రహదారి వెంట పోలకంపాడు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలైన రైల్వే ఉద్యోగి ఆనందరావు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సునీత ఉండవల్లిలో ఉంటూ విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం విధులు ముగిశాక ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలకంపాడు మూడు బొమ్మల సెంటర్ దాటిన తర్వాత వెనుక నుంచి మద్యం మత్తులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఐదు నెలల గర్భిణి అయిన సునీతను ఆనందరావు పైకి లేపుతుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో సునీత చెప్పు తీసుకుని కొట్టింది. రెచ్చిపోయిన యువకులు ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారు. ఆనందరావు, సునీతలను రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. భార్యాభర్తలు రక్షించండి అని కేకలు వేయడంతో తాడేపల్లి పోలీసులు వస్తున్న సంగతి తెలిసి యువకులు పరారయ్యారు. వీరిపై రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. -
సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురి అరెస్ట్
పుట్టపర్తి టౌన్: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ రత్న సోమవారం చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయగా.. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. దళిత బాలికపై కొన్ని నెలలుగా టీడీపీ కీచకులు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో బాలిక గర్భం దాలి్చంది. విషయం బయటకు రాకుండా నిందితులు జాగ్రత్త పడుతూ వచ్చారు. అత్యాచారం చేసిన వీడియోలు తీసి తల్లీకూతుర్లను బెదిరిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన 14 మందితో పాటు రాజీ కుదర్చడానికి ప్రయతి్నంచిన నలుగురు వ్యక్తులతో కలసి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ధర్మవరం డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ నేతృత్వంలో అచ్చంపల్లి వర్దన్, తలారి మురళి, నందవర్దన్రాజు, నాగరాజు, బోయ సంజీవ, బడిద రాజన్నలను రాప్తాడు సమీపంలో అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. మారుమూల ప్రాంతం కావడం, ఆరి్థక చేయూత, అవగాహన లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని, మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టేందుకు భవిష్యత్‌లో అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, ధర్మవరం టూటౌన్ సీఐ రెడ్డెప్ప ఉన్నారు. -
కంటనీరులే నింపకమ్మా.. సొమ్మసిల్లకే కూనలమ్మా!
నాన్న చనిపోయాడు. అమ్మకు మానసిక వైకల్యం. నా అనే దిక్కులేదు. అమ్మకొచ్చే పెన్షన్‌తో బతుకీడుస్తూ, కష్టాల మధ్యే చదువుకుంటున్న తొమ్మిదో తరగతి బాలికపై టీడీపీ మూకల పైశాచికత్వం కోరలు చాచింది. వంతులేసుకుని మరీ నెలలు తరబడి కీచకపర్వం సాగింది. ఇప్పుడా బాలిక జీవితం అగమ్యగోచరంగా మారింది.పద్నాలుగు మంది కామాంధుల కర్కశానికి బలైన ఈ చిన్నారిని చూస్తే దుఃఖం పొంగుకొస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకుల సామూహిక అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక 8 నెలల గర్భంతో అనంతపురంలోని సర్వజనాసుపత్రిలో బేలచూపులతో మౌనంగా రోదిస్తోంది. –సాక్షి ప్రతినిధి, అనంతపురంవెలుగులోకి రాకపోయి ఉంటే పరిస్థితి ఏమిటి?ఈ దారుణాన్ని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే బాలిక పరిస్థితి ఎలా ఉండేదోనని చుట్టుపక్కల గ్రామస్తులు వాపోతున్నారు. ఊరు ఊరంతా టీడీపీ వర్గం కావడం.. ఏదైనా బయటకు చెబితే ప్రమాదం ఉండటంతో బాలిక ఎక్కడా నోరెత్తలేకపోయింది. కరుణ చూపాల్సిన పెద్దమనుషులు సైతం నిందితులకు వత్తాసు పలుకుతూ బాలికకు అబార్షన్ చేయించాలని నిందితులను తప్పించాలని చూశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల జోక్యం అడుగడుగునా అడ్డుగానే నిలిచింది. తమ వర్గం కాబట్టి నిందితులను తప్పించాలనే ఒత్తిడి పోలీసులపై పెరిగింది. పెద్ద సెక్షన్లు పెట్టొద్దని గట్టిగానే చెప్పారు. అప్పటికే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో వీరి ఆటలు సాగలేదు.బాధితురాలి పరిస్థితి దయనీయంబాధితురాలు 8 నెలల గర్భిణిగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో హిమోగ్లోబిన్ 6.3 శాతం మాత్రమే ఉన్నట్టు తేలింది. సాధారణ మహిళకు 10 శాతంపైనే ఉండాలి. గర్భిణికి 11.5కు పైగా ఉండాలి. అలాంటిది ఈ బాలికకు కేవలం 6.3 శాతం ఉండటంతో అదనపు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. జూలై 27వ తేదీలోగా ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. బడికి వెళ్లాల్సిన వయసులో అత్యాచారానికి గురై ఆస్పత్రిలో ప్రసవానికి రావడంతో ఆ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది.బాలికను కనీసం ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యం చేయడం లేదు. పోలీసులు అక్కడికి తెచ్చి వదిలేసి వెళ్లారు. ఇప్పుడేమో వార్డులో అందరిలాగే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాన్పుకు వచ్చిన మిగతా మహిళల ముందు ఈ బాలికను చూడాలంటేనే దయనీయంగా ఉంది. కనీసం ప్రత్యేక వైద్య పరీక్షలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు.సఖి సెంటర్‌కు తరలించాలన్న పోలీసులురామగిరి సీఐ ఆస్పత్రి సిబ్బందిని కలిసి బాలికను సఖి సెంటర్‌కు తరలించాలని అడిగినట్టు తెలిసింది. దీనికి వైద్యులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికకు వైద్యసేవలు చాలా అవసరమని, ఇప్పట్లో బాలికను సఖి సెంటర్‌కు తరలించడం మంచిది కాదని సూచించారు. ఆస్పత్రికి అయితే రోజూ వందల మంది వస్తుంటారు. మీడియా ప్రతినిధులూ వచ్చి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో బాలికపై సామూహిక అత్యాచార విషయంపై రోజూ చర్చ జరుగుతుందన్న కారణంగా పోలీసులు బాధితురాలిని సఖి సెంటర్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అంధకారంలో బాలిక భవిష్యత్ బాధితురాలి భవిష్యత్ అంధకారంలో పడింది. కడుపులో పెరుగుతున్న బిడ్డను అబార్షన్ చేసి తీసేయలేమని ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు. కచ్చితంగా ప్రసవం చేయాల్సిందేని స్పష్టం చేశారు. ప్రసవం అయ్యాక తల్లీ బిడ్డ ఎలా బతకాలి? ఆ ఊర్లో ఉండగలరా? నిందితులకు శిక్ష పడ్డాక ఈ అమ్మాయిని ఆ ఊర్లోకి టీడీపీ నేతలు రానిస్తారా? ఒకవేళ పోలీసు బందోబస్తు మధ్య అమ్మాయి ఊర్లోకి వెళ్లినా ఆమెను బతకనిస్తారా? ఇవన్నీ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అందరి నోట వినిపిస్తున్న ప్రశ్నలు. పరామర్శ లేదు.. ప్రభుత్వ సాయమూ లేదు ఈ అభాగ్యురాలి విషయం వెలుగులోకి వచ్చి నాలుగు రోజులు దాటినా ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించలేదు. కనీసం రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత బాధితురాలిని పరామర్శించిన పాపాన పోలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఈ దారుణాన్ని ఖండించలేకపోయారు. పరిటాల సునీత సొంత మండలం రామగిరి కావడం.. ఇక్కడ ఏం జరిగినా పోలీసులు సునీత కుటుంబానికి అండగా ఉండటం సాధారణమైపోయింది. నియోజకవర్గ పరిధిలో ఆరు నెలల్లోనే మూడు హత్యలు జరిగాయి. ఒక అత్యాచారమూ జరిగింది. వీటన్నిటిలోనూ సునీత వర్గీయులే నిందితులుగా ఉన్నారు. -
‘మా పాప చనిపోయేంత వరకూ పోలీసులు పట్టించుకోలేదు’
అనంతపురం: ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు గురికావడంపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు(సోమవారం, జూన్9) తన్మయి తల్లి దండ్రులతో కలిసి గిరిజన సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. పోలీసులు సరిగా పని చేయకపోవడం లేదంటూ నినాదాలు చేస్తూ అనంతపురం ఎస్పీ కార్యాలయాన్ని మట్టడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితుల చోటు చేసుకున్నాయి. దాంతో ఎస్సీ కార్యాలయం ముందే బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. .. తమ పాప మిస్ అయ్యిందని కేసు పెట్టడానికి వెళ్లినా పోలీసులు అస్సలు పట్టించుకోలేదన్నారు. కనీసం ఏ రకంగాను పోలీసులు దర్యాప్తు చేయలేదన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ కూడా పరిశీలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసల నిర్లక్ష్యం కనిపించిందని, ఇప్పుడు డెడ్‌బాడీ కనిపించిన తర్వాత చేసేదేంటని కన్నీటి పర్యంతమయ్యారు. తాము అనుమానితుల గురించి చెప్పినా పట్టించకోకపోవడం వల్లే ఇంతవరకూ వచ్చిందన్నారు.గిరిజన విద్యార్థిని దారుణహత్య -
వైఎస్సార్ జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులు ఇద్దరు పిల్లలను నాగసానీపల్లెకు చెందిన వారిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బాలతిమ్మయ్య గారి పల్లెలో విషాదం నెలకొంది. మామిడి తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు పిల్లలు నీటి సంపులో పడి సోమవారం ఉదయం మృతి చెందారు. మృతులు ఖాజీపేట మండలం నాగసానీ పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. అయితే, పిల్లలు ఇద్దరు బతుకు దెరువు కోసం కాజీపేట నుండి చక్రాయపేటకు వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నప్పుడే పిల్లల తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరుగుతున్నారు. -
గిరిజన విద్యార్థిని దారుణహత్య
అనంతపురం /కూడేరు: కూటమి సర్కారు పాలనలో మరో ఘాతుకం జరిగింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో ఇంటర్ విద్యార్థిని తన్మయి(19) దారుణహత్యకు గురైంది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. ఘటనాస్థలంలో బీరుబాటిల్ లభ్యమైంది. దీంతో దుండగులు బీరుబాటిల్‌తో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం నగరంలోని టీవీ టవర్ దగ్గర ఉన్న రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి, అరుణ దంపతులకు కొడుకుతోపాటు కుమార్తె తన్మయి ఉన్నారు. తన్మయి ప్రస్తుతం ఆకుతోటపల్లి వద్ద గల ఓ కాలేజీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన్మయి ఈ నెల 3న అదృశ్యం కావడంతో మరుసటి రోజు తండ్రి లక్ష్మీపతి అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాత్రి 9గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్ డ్రింక్ తాగడానికి బయటకు వెళ్లిందని, తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే.. కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ముళ్ల పొదల్లో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆదివారం తన్మయి తల్లిదండ్రులు చూసి తమ కూతురేనని గుర్తించారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.హత్యగా ధ్రువీకరించిన వైద్యులు తలకు బలమైన గాయమైందని, దేనితోనో కొట్టడంతోనే తన్మయి మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో బీర్ బాటిల్ ఉండడంతో దాంతోనే తలపై కొట్టి చంపారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తన్మయి కాల్‌డేటా ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.నిందితులను కఠినంగా శిక్షించాలిగిరిజన విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. హోంమంత్రి దళిత మహిళ అయినా కూటమి పాలనలో రాష్ట్రంలోని దళిత, గిరిజన మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. -
నీటిలో మునిగి ఆరుగురి మృతి
డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్ కుమారులు గుంట సాయికిరణ్ (14), గుంట భానుతేజ్ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్‌తో ఆడుకుంటుండగా.. బాల్ పక్కనే ఉన్న నదిలో పడింది. బాల్ కోసం సయ్యద్ ఖాదర్ వలి (13), సయ్యద్ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడిని బలిగొన్న అలలు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ ఎదురుగా బీచ్‌లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్‌కు వచ్చింది. వీరిలో స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న సతీష్‌ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు. -
AP: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
అనంతపురం: జిల్లాలో దారుణం చోటు చేసకుంది. ఇంటర్ చదువుతున్న తన్మయి అనే విద్యార్థిని దారుణంగా హత్య చేయబడింది. కొంతమంది దుండగులు ఇంటర్ విద్యార్థినిని తొలుత తలపై బండరాయితో కొట్టి చంపి.. ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఉరవకొండ నియోజవర్గం కూడేర మండలం బ్రహ్మణపల్లి వద్ద మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తమ కుమార్తె కనిపిండం లేదని ఆరు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసలు పట్టించుకోలేదని, చివరకు ఇలా పూర్తిగా కాలిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటర్ చదివే ఆ విద్యార్థినిని హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి కాల్చివేసినట్ల తెలుస్తోంది. ఆర రోజుల క్రితం అదృశ్యమైనప్పటికీ పోలీసుల కాలయాపన చేయడంతోనే ఇలా జరిగిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు ముందుగానే పట్టించుకని ఉంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాల్‌లిస్ట్ పేరుతో పోలీసులు కాలయాపన చేశారని ఆ అమ్మాయి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీర్ బాటిల్‌తో కొట్టడం వల్లే..విద్యార్థిని తన్మయిని బీర్ బాటిల్‌తో కొట్టడం వల్లే చనిపోయిందని అనంతపురం వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన తన్మయి అదృశ్యం అయినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. వంటనే కేసు నమోదు చేసి అనుమానితులను విచారించామన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు సీఐ రాజేంద్రనాథ్. -
టీడీపీ నేతల కీచకపర్వం.. నిందితులకు ‘పరిటాల’ వత్తాసు!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : దళిత మైనర్ బాలికపై ఆరు నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో టీడీపీ కీచకులు సాగించిన ఈ దారుణకాండను శుక్రవారం ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ అమానుష ఘటన అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.రాజకీయ, పోలీసు వర్గాల్లో సైతం విస్మయం వ్యక్తమైంది. ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు ముందుగానే తెలిసినా, ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చే వరకు స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షి కథనంతో ఈ ఘోరం బయటి ప్రపంచానికి వెల్లడైంది. నిందితుల్లో తొమ్మిది మందిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని విచారణ కోసం అంటూ రామగిరి నుంచి ధర్మవరం తీసుకెళ్లినట్లు సమాచారం. వీరిని ఎక్కడ పట్టుకున్నారనే విషయాన్ని పోలీసులు వెల్లడించ లేదు. దాదాపుగా నిందితుల పేర్లన్నీ ఇప్పటికే బయటకు వచ్చినా, ఎందుకు ముందుగానే అదుపులోకి తీసుకోలేకపోయారనేది అనుమానాలకు తావిస్తోంది.టీడీపీ ప్రముఖ నేతల జోక్యంతో కేసును, నిందితులను తారుమారు చేసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత కనుసన్నల్లోనే నిందితులు దాక్కున్నట్లు సమాచారం. వీడియో వైరల్ చేస్తామని బెదిరించి మైనర్ బాలికపై 14 మంది టీడీపీ వర్గీయులు ఆర్నెల్ల పాటు అత్యాచారం సాగించారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు పొక్కింది. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా నిందితులు తీవ్రంగా బెదిరించారు. దీంతో గురువారం మధ్యాహ్నమే సదరు బాలిక.. తల్లితో కలిసి గ్రామం వదిలి వెళ్లిపోయారు. వారు ఒక టీడీపీ నేత ఇంట్లో ఉండగా.. పోలీసులు ఆ బాలికతో మాట్లాడినట్లు సమాచారం. నీకెవరూ దిక్కు లేరంటూ.. బాధిత బాలికను జిల్లా ఎస్పీ వి.రత్న నేతృత్వంలో ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం విచారించినట్లు తెలిసింది. విచారణలో బాలిక విస్తుగొలిపే వాస్తవాలు చెప్పినట్లు సమాచారం. 14 మందీ అదే గ్రామానికి చెందిన టీడీపీ వారేనని వివరించినట్లు తెలిసింది. మొదట ఒకరు బెదిరించి, అత్యాచారానికి పాల్పడి.. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో వీడియో తీశాడని, ఆ తర్వాత ఆ వీడియోను ఇతరులకు పంపారని చెప్పినట్లు సమాచారం. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ అమానుషానికి పాల్పడ్డారని కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది. ఇలా దాదాపు ఆరు నెలలుగా అత్యాచారం చేశారని ఎస్పీ విచారణలో బాలిక వెల్లడించినట్లు సమాచారం.‘ఎవరికైనా చెబితే చంపేస్తాం. నీకు తండ్రి లేడు. తల్లికి మతి స్థిమితం లేదు. నీకెవరూ దిక్కు లేరు. మేం చెప్పినట్లు వినకపోతే నీ వీడియోలు బయట పెడతాం అని బెదిరించే వారు. అవి చూపుతూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎంతగా బతిమాలినా వదిలి పెట్టేవాళ్లు కాదు. ఏం చేయాలో తోచేది కాదు. దొంగగా ఏడ్చుకోవాల్సి వచ్చేది. దీంతో నాకు చాలా సార్లు చనిపోవాలనిపించింది. అయితే అమ్మ పరిస్థితి చూసి ఆ పని చేయలేకపోయాను’ అని బాధిత బాలిక తన నరకయాతనను పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికను జువైనల్ హోమ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. నిందితులకు ‘పరిటాల’ వత్తాసు! సామూహిక అత్యాచారంలో పాల్గొన్నట్లు అనుమానం ఉన్న యువకులందరూ టీడీపీ సానుభూతిపరులే. దీంతో వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. వాస్తవానికి బాధిత బాలిక కుటుంబం కూడా టీడీపీలోనే కొనసాగుతోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత జరిగిన విజయోత్సవ సంబరాల్లో బాధిత బాలిక తండ్రి మరణించాడు. అయినప్పటికీ పరిటాల సునీత బాధిత బాలిక వైపు కాకుండా.. నిందితుల వైపు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం ఏడుగుర్రాలపల్లిలో రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు పర్యటించారు. ఘటనకు సంబంధించి గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. బాధిత బాలికకు న్యాయం జరిగేవరకు పోరాడతామని దళిత సంఘం నాయకులు పేర్కొన్నారు. -
కాకినాడలో సైబర్ స్కామర్లు
కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఎస్పీ బిందుమాధవ్ «శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నార్ని సతీశ్ చంద్ర (37), దాసరి వీరవెంకట సత్యనారాయణ (31) కొద్ది నెలలుగా కాకినాడలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. పాస్‌బుక్, చెక్‌బుక్, ఏటీఎం కార్డుతో కూడుకున్న బ్యాంక్ కిట్లు తమకు అప్పగిస్తే ఖాతా తెరిచేందుకు అయ్యే ఖర్చుతో పాటు మరో రూ.5 వేలు ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. ఈ ఖాతాపై రెండు నెలల్లో రూ.5 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో పదుల సంఖ్యలో జనం ఖాతాలు తెరచి, కిట్లను వీరికి అప్పగించారు. కాకినాడకు చెందిన ఉదయ్‌కిరణ్‌కు ఈ కిట్లు అప్పగిస్తే అతను వీరికి డబ్బు ఇచ్చేవాడు. కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన కొర్రా లోవరాజు ఖాతా తెరచి కిట్ అప్పగించి రెండు నెలలైంది. లోన్ కోసం కాకినాడలోని బ్యాంక్ ఆఫ్ కర్ణాటకకు వెళ్లాడు. బ్యాంక్ అధికారులు అతని ఖాతా పరిశీలిస్తే కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో లోవరాజు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కాకినాడకు చెందిన ఉదయ్‌కిరణ్ అనే వ్యక్తికి ఈ ఖాతాల కిట్లు అప్పగిస్తే అతడు వీటిని దుబాయ్ పంపిస్తున్నాడని తేలింది. దుబాయ్‌లో ఈ బ్యాంకు వివరాలు పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నాడని తెలిసింది. ఇందుకు ఉదయ్ కిరణ్‌కు ఖాతాకు రూ.30 వేల చొప్పున పుట్టారామ్ చెల్లిస్తున్నాడు. గడచిన 2 నెలల్లో సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణ కాకినాడ జిల్లాతో పాటు గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటకకు చెందిన పేర్లతో 48 ఖాతాలు తెరచి రూ.9 కోట్ల విలువైన మొత్తం జమ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సతీశ్ చంద్ర, సత్యనారాయణను అరెస్టు చేయగా ఉదయ్‌కిరణ్ పరారీలో ఉన్నాడు. పుట్టారామ్ను పట్టుకునేందుకు కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమిచ్చామని ఎస్పీ చెప్పారు. -
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
సాక్షి, టాస్క్ ఫోర్స్ : తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అధికార పార్టీ నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా మాట్లాడిన సెల్ఫీ వీడియో (వాంగ్మూలం) లోని మాటలు వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమిలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎమ్వీఆర్ అలియాస్ గాం«దీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి సామగ్రిని విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. వీరికి గాంధీ సోదరుడు వైఎన్ఆర్ హైదరాబాద్ నుంచి కావాల్సిన సరుకును పంపుతున్నాడు. ఈ క్రమంలో తన భాగస్వామి గాంధీ అలియాస్ ఎమ్వీఆర్ మృతి చెందడంతో ఎవరికి రావాల్సిన వాటాలు వారు తీసేసుకున్నారు. లక్ష్మీనారాయణ సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాంధీ కింద పని చేస్తున్న హనుమంతు, వెంకటేష్, రెడ్డి, సునీల్ వచ్చి తాము కూడా వ్యాపారం చేసుకుంటామని, సరుకు ఇప్పించమని కోరారు. దీంతో లక్ష్మీనారాయణ వారికి కావాల్సిన సరుకు ఇవ్వమని వైఎన్‌ఆర్‌కు మాట సాయం చేశాడు. అప్పులకు తాను గ్యారెంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వీరి నుంచి నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మొత్తంగా రూ.35 లక్షలు ఇవ్వాలంటూ వైఎన్ఆర్ ఏడాదిన్నర నుంచి లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు. టీడీపీ రాకతో వేధింపులు సార్వత్రిక ఎన్నికల సమయంలో గుత్తా లక్ష్మీనారాయణ మరో నలుగురు కలిసి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించటంతో వైఎన్ఆర్ రాజుపాలెం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రాజుపాలెం ఎస్ఐ మూడు నెలల క్రితం పిలిచి మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పారు. పగబట్టిన వైఎన్ఆర్ ఎలా అయినా సరే లక్ష్మీనారాయణను వేధించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పిడుగురాళ్లకు చెందిన తెలుగుదేశం నాయకులు ఖలీల్ రామారావు, పట్టిపాటి రామారావు, వంశీలను ఆశ్రయించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం నాయకులకు పోలీసులతో ఉన్న పరిచయాలతో లక్ష్మీనారాయణను రోజూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తాను వైఎన్‌ఆర్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని పోలీసులతో తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు పంచాయతీని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వద్దకు తీసుకువచ్చారు. నువ్వు కమ్మోడివి కాదా.. రెడ్లకు పుట్టావా? సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి నాలుగు రోజుల క్రితం లక్ష్మీనారాయణకు పిలుపొచ్చింది. అక్కడికి వెళ్లగానే.. ‘నువ్వు కమ్మోడివి. నీకు ఆ పార్టీ (వైఎస్సార్సీపీ)తో పని ఏంటి? రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా? రాజకీయాలు చేయాలంటే నీకు ఇక పార్టీలే లేవా? నువ్వు కమ్మోడివేనా.. నువ్వేమైనా రెడ్లకు పుట్టావా?’ అంటూ పోలీసులు నోటికి వచ్చినట్లు దూషించారు. ‘మర్యాదగా టీడీపీ నేతలు ఇవ్వాలంటున్న రూ.35 లక్షలు చెల్లిస్తే ఓకే. లేదంటే నా సంగతి ఎలా ఉంటుందో తెలుసుగా’ అంటూ డీఎస్పీ బెదిరిస్తూ హెచ్చరికలు చేశాడు. డీఎస్పీ టార్చర్ పెట్టడాన్ని భరించలేక మనస్థాపం చెందిన లక్ష్మీనారాయణ శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ‘జగనన్నా.. నేను బతికుంటానో లేదో తెలియదు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటే చాలు టార్చర్ పెడుతున్నారు. దయచేసి మీరు నా శవాన్ని తాకి పాడె మోయాలి. నా కుటుంబాన్ని పరామర్శించాలి. అప్పుడైనా ఈ అరాచకాలకు చెక్ పడుతుందేమో. మళ్లీ నాలాంటోడు ఇంకొకడు బలి కాకుండా, నాలాంటి కుటుంబం బలి కాకుండా ఉంటుందేమో. నా చావుకు నేను రాజకీయం పులమడం లేదు. చచి్చపోతూ అబద్ధం ఆడనన్నా. కేవలం వైఎస్సార్సీపీ అని వేధిస్తున్నారన్నా’ అని వాపోయారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. లక్ష్మీనారాయణను బంధువులు గుంటూరుకు తరలించగా వెంటిలేటర్‌పై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తడీఎస్పీ సహా బాధ్యులపై చర్య తీసుకోవాలిసీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో వైఎస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని, అందుకు బాధ్యులైన డీఎస్పీతో సహా అందరిపైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ కార్యకర్త గుత్తా లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో, లేఖతో సహా శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. ఆయనపై గతంలో వ్యాపార భాగస్వామి చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచి పెట్టారు. కానీ, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైఎస్సార్సీపీలో ఎందుకున్నావు.. అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున (శుక్రవారం) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావు బతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా’ అని ఆ పోస్ట్‌లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
మైనర్ బాలికపై టీడీపీ నేతల సామూహిక అత్యాచారం
రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో టీడీపీ నేతల కీచక పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై టీడీపీ నేతలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సంచలనంగా మారింది. రామగిరిమండలం ఏడుగురాకలపల్లిలో ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు టీడీపీ నేత. ఈ క్రమంలోనే ఆ బాలికను లోబర్చుకుని నగ్న దృశ్యాలు చిత్రీకరించారు. ఆపై ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేసి పలువురు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. దీనిపై ఆ బాధిత కటుంబంతో పాట దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తన్నారు. -
అక్రమ కేసు పెట్టి..
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను ఏకంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుని బంధువుల, స్థానికుల కథనం ప్రకారం.. వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామానికి చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి పేకాట ఆడుతున్నట్లు అనుమానించి మే 6న ఖాజీపేట పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అతనితోపాటు మరో 9 మందిని పిలిపించి విచారణ చేపట్టారు.తాము పేకాట ఆడలేదని వారు చెప్పినా.. పోలీసులు వినిపించుకోలేదు. రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డిని పోలీసులు తీవ్రంగా వేధించారు. అనంతరం అతనితోపాటు విచారణకు వచ్చిన అందరినీ ఇంటికి పంపించారు. 7,8 తేదీల్లో స్టేషన్‌కు మళ్లీ విచారణ పేరుతో పిలిపించారు. 9న వారి పై పేకాట కేసుతోపాటు గంజాయి కూడా అమ్ముతున్నట్లు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో రెడ్యం శివలక్ష్మీనారాయణరెడ్డి తోపాటు మరో 8 మందిని నిందితులుగా చూపుతూ, వారి వద్ద నుంచి 2.570 కిలోల గంజాయితోపాటు రూ 20,500 నగదు 52 పేకముక్కలు దొరికినట్లు చూపించారు. తనకు సంబంధంలేని గంజాయి కేసులో అరెస్టయిన శివలక్ష్మినారాయణరెడ్డి మే 29న బెయిల్‌పై బయటకు వచ్చారు.తన భార్య సుభాషిణికి జరిగిన విషయం వివరించారు. ఖాజీపేట సీఐ మోహన్ తనను అక్రమంగా పేకాట, గంజాయి కేసులో ఇరికించారని ఆవేదన చెందారు. తనను చిత్ర హింసలకు గురిచేసినట్లు చెప్పారు. తగిలిన దెబ్బలను భార్యకు చూపించి తీవ్ర మనోవేదన చెందారు. సీఐ మోహన్‌పై ప్రైవేటు కంప్లయింట్ వేసి కోర్డులోనే న్యాయం కోరదామని ఆమె నారాయణరెడ్డికి సర్ది చెప్పే యత్నం చేశారు. ఆయన బుధవారం మైదుకూరులో జరిగిన వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.జరిగిన అన్యాయాన్ని అక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు చెప్పి బాధపడ్డాడు. తీవ్ర మనోవేదనతో రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి బయటకు పోయి పుప్పగిరి వెళ్లే దారిలో ఉన్న సబ్‌స్టేషన్ మెయిన్ తీగలను పట్టుకుని విద్యుదాఘాతానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎంతకూ ఇంటికి రాక పోవడంతో భార్యతోపాటు బంధువులు వెతికారు. చివరకు సబ్‌స్టేషన్‌లో విద్యుత్ తీగ పట్టుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. సీఐ మోహన్‌పై మృతుడి భార్య ఫిర్యాదుఖాజీపేట సీఐ మోహన్ తన భర్త నారాయణరెడ్డిని డబ్బుల కోసం, వేధించారని, డబ్బులు ఇవ్వక పోవడంతో అక్రమంగా కేసు నమోదు చేసి జైలుకు పంపి తన భర్త మృతికి కారణమయ్యాడని సుభాషిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారణమైన సీఐ మోహన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిశారు. సీఐది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు ఎస్పీ భరోసా ఇచ్చారు. అనంతరం దుంపలగట్టు గ్రామంలో జరిగిన లక్ష్మీనారాయణరెడ్డి అంత్యక్రియల్లో నాయకులు పాల్గొన్నారు. -
దళిత బాలికను చెరచిన టీడీపీ కీచకులు
అభం శుభం తెలియని బాలికను మానవ మృగాలు కనీ వినీ ఎరుగని రీతిలో దారుణంగా కాటేశాయి.. స్కూలుకెళ్లే పిల్లలను సైతం వదిలి పెట్టని దారుణ రోజులు దాపురించాయి.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 మంది వంతు లేసుకుని.. వీడియో తీసి బెదిరిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తూ.. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా బలాత్కారం చేయడం దిగ్భ్రాంతి పరుస్తోంది.. అధికారం అండ ఉండగా అడిగే వారు లేరని ఏకంగా ఆరు నెలల పాటు కీచక పర్వం కొనసాగించడం విస్తుగొలుపుతోంది.. తండ్రి లేని పిల్ల.. మతి స్థిమితం లేని తల్లి.. పైగా ఎస్సీ బాలిక.. ఏం చేస్తుందిలే అన్న కండ కావరం, అధికార మదంతో ఆ బరితెగింపు రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు అద్దం పడుతోంది.. పాపం.. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ పరిస్థితి ఆ బాలికది.. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలనుకుని దాచుకున్న కాసింత ధైర్యాన్ని సైతం ఆ దుర్మార్గులు పదేపదే బెదిరింపులతో చంపేశారు.. దుప్పటి పంచాయితీలు, రాయ‘బేరాలు’తో వెల కట్టే పనిలో పాలకులు బిజీగా ఉండటం దురదృష్టం.సాక్షి, టాస్క్‌ఫోర్స్ : అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ అల్లరి మూకలు కొన్ని నెలల పాటు పదే పదే అత్యాచారం చేశారు. వీడియోలు తీసి మరీ ఒకరి తర్వాత మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగు చూసింది. టీడీపీ నేతల ఒత్తిడితో ఇప్పటికే బాధిత బాలిక కుటుంబం ఊరి నుంచి ఎక్కడికో వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు కన్నేశారు. ఏడాది క్రితం టీడీపీ గెలుపు సంబరాల్లో తప్పెట కొడుతూ బొలెరో నుంచి జారి కింద పడి తండ్రి మృతి చెందాడు. తల్లికి మతి స్థిమితం సరిగా లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ విద్యార్థినిపై తొలుత కొందరు అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. ‘నీ వీడియో ఒకటి మా వద్ద ఉంది’ అంటూ బెదిరిస్తూ.. మరికొందరు లొంగదీసుకున్నారు. గత ఆరు నెలలుగా ఏకంగా 14 మంది ఆ చిన్నారిని ఆటబొమ్మను చేసి ఆడుకున్నారు. నిందితులందరూ టీడీపీకి చెందిన వారే కావడంతో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ అండదండలు ఉన్నాయనే ఉద్దేశంతో స్థానికులు మౌనం వహించారు. గర్భం దాల్చిన బాలిక పోలీసులను ఆశ్రయించకుండా గ్రామంలోనే దుప్పటి పంచాయితీ చేసి మూసి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఇబ్బందులు తప్పవని టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. వీడియో ఉందని బెదిరిస్తూ.. ఆర్నెల్ల కాలంలో పేరూరు పంచాయతీకి చెందిన 14 మంది యువకులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. నిందితుల్లో బడగొర్ల అభిషేక్, బూడిద రాజేష్, బాసి గిరి, బాసి కార్తీక్, బాసి రాజేంద్ర, బాసి సోనప్ప, బాసి అంజి, తలారి మురళి, రొద్దకంపల్లి మహేశ్, హరిజన సురేశ్, హరిజన హేమంత్ పేర్లు బయటపడ్డాయి. మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. కాగా నిందితుల్లో కొందరు ఇప్పటికే గ్రామం వదిలి పరారయ్యారు.బాధిత కుటుంబం అదృశ్యంగురువారం మధ్యాహ్నం నుంచి సామూహిక అత్యాచారం విషయం ఆ నోటా.. ఈ నోటా తెలియడంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు బెదిరించినట్లు తెలిసింది. సాయంత్రం నుంచి గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులు కనిపించలేదు. రామగిరి సీఐ శ్రీధర్ వెళ్లి విచారణ చేయగా.. బాధిత బాలిక ఇంటికి తాళం వేసి ఉంది. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలే వారిని ఎక్కడికో తరలించారని గ్రామంలో చర్చ జరుగుతోంది. అబార్షన్ చేయించుకోవాలని బెదిరింపు?సదరు బాలిక అబార్షన్ చేయించుకుని.. ఎలాంటి కేసులకు వెళ్లకుండా ఉండాలని టీడీపీ నాయకులు కొందరు బెదిరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో బాలికను ఎక్కడో టీడీపీ నాయకులే దాచి ఆస్పత్రికి తరలించి, అబార్షన్ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అబార్షన్ చేయిస్తే ఎలాంటి కేసు లేకుండా మూసేయాలని పన్నాగం పన్నినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. హరియాన్ చెరువుకు చెందిన రౌడీషీటర్ నాగరాజు కనుసన్నల్లో బాధిత బాలికను దాచినట్లు సమాచారం. పార్టీ కోసం ప్రాణాలు విడిచిన కుటుంబానికి అండగా నిలవాల్సిన పరిటాల కుటుంబం నిందితుల వైపు ఉందనే విషయంపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.ఎవరూ ఫిర్యాదు చేయలేదువిషయం నా దృష్టికి రాగానే గురువారం మధ్యాహ్నం ఏడుగుర్రాలపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేశాం. అయితే ఎవరూ వివరాలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు. బాధిత బాలిక కుటుంబం నివసిస్తోన్న ఇంటికి తాళం వేసి ఉంది. వారి బంధువుల ఇళ్లన్నీ పరిశీలిస్తున్నాం. ఫిర్యాదు వస్తే ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వెనుక ఎవరు ఉన్నా చట్టానికి అతీతులు కారు.– శ్రీధర్, రామగిరి సీఐహోం మంత్రి సమాధానం చెప్పాలి దళిత బాలికపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దళిత, గిరిజనులపై రాష్ట్రంలో వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పాలన పూర్తిగా విఫలమైంది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు.. బాలికలకు రక్షణ లేకుండా పోయింది. దళిత సామాజిక వర్గానికి చెందిన హోం మంత్రి అనిత ఇందుకు సమాధానం చెప్పాలి.– సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడుమహిళా సమాజం సిగ్గు పడేలా.. రాప్తాడు ఎమ్మెల్యే కూడా మహిళే. పైగా ఎమ్మెల్యే పరిటాల సునీత స్వగ్రామానికి సమీపంలోనే ఏడుగుర్రాలపల్లి ఉంది. చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలకు కూడా రక్షణ కల్పించలేని ఎమ్మెల్యే ఉంటే ఏం? లేకుంటే ఏం? శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ కూడా మహిళే. ఈ కేసులో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్‌నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్‌పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్‌ను ఆపి రమేష్నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్‌నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్‌నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్‌నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.రాజకీయ నేపథ్యం..రమేష్‌నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్‌నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాసరావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు. మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసుజంట హత్యల కేసును వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసులు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలిపాడు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో తనకు ఎదురుండదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అల్లారు. హత్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మోది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందుకు కత్తులే వాడేవారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు’ అంటూ హత్యానంతరం నిందితులు కారులోంచి కతు్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమవుతోంది. నిందితులు బెదిరించారన్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. -
ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్‌కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్‌కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్‌కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు. -
కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి
సాక్షి, చిత్తూరు: కుప్పంలో పోలీసుల మీదకే వాహనంతో దూసుకెళ్లిన దొంగల ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పోలీసులు పురోగతి సాధించారు.కుప్పం రైల్వే స్టేషన్లో ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం పుష్పుల్ రైలులో బెంగళూరు వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా మిగిలిన ముఠా సభ్యుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. కరుడుగట్టిన దొంగల ముఠా ఒకటి సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్‌పోస్టు వద్ద పోలీసులను చూసి దుండగులు తమ కారుతో తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే కానిస్టేబుళ్లు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కారు నడుపుతున్న డ్రైవర్ తొడకు బుల్లెట్ గాయమైంది. అయినా కూడా ఆ ముఠా తప్పించుకుంది. కొద్దిదూరం వెళ్లాక కారును వదిలేసి ఆ ముఠా సభ్యులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. కుప్పం పరిధిలోని పలు గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఆ ముఠాలో హర్యానా, రాజస్థాన్ ముఠా సభ్యులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆమె వితంతువు. మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఆ ప్రియుడి సాయంతోనే తన అత్తమామలను హతమార్చేెందుకు ప్రయత్నించి పట్టుబడి పోయింది. ఆ ప్రియుడేమో ‘‘ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?. నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?.. జనసేన లీడర్ని, ఇక్కడి ఎమ్మెల్యే పీఏని’’ అంటూ ఊరి జనంపైనే బెదిరింపులకు దిగాడు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. మమత అనే మహిళ భర్త ఐదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అత్తమామల దగ్గరే ఉంటూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి పెద్దలు ఆమెను మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ఏకంగా వాళ్ల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో.. ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తమామలను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన హనుమంతరావు.. కొబ్బరి కాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు, మంగమ్మలపై దాడి చేయబోయాడు. దీంతో వాళ్లు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో షాక్ తిన్న హనుమంతరావు పారిపోయే యత్నం చేయగా.. గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. ఆ సమయంలో తాను.. జనసేన లీడర్నని, నందిగామ ఎమ్మెల్యే పీఏ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు.. హనుమంతరావు ఫోన్లోని ఫొటోలు, ఇతర వివరాల ఆధారంగా పోలీసులు జనసేన నేతగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. -
ఏపీ కేంద్రంగా ప్ర‘మాదక’ర దందా!
పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంది. కూటమి సర్కారు వచ్చి ఏడాదవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మద్యం, గంజాయి దందాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సర్కారే బెల్టుషాపులను ప్రోత్సహిస్తోంది. పర్మిట్ రూంలకు ఇష్టానుసారం అనుమతులిచ్చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో రూ.కోటి విలువైన కొకైన్ పట్టుబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఉండడం కూటమి ప్రభుత్వం, పోలీసుశాఖ వైఫల్యానికి నిదర్శనం. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన కూటమి సర్కారు ప్రతిపక్ష ఎంపీపై ఎదురుదాడికి దిగడం నిజంగా సిగ్గుచేటు.. హాస్యాస్పదం.. జీడిమెట్ల(హైదరాబాద్)/తిరుపతిక్రైమ్: తిరుపతి నుంచి హైదరాబాద్‌కు కొకైన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలు తీసుకువచ్చి అమ్మేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల ముఠాను బాలానగర్ ఎస్వోటీ, కూకట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఏపీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు గుణశేఖర్ పరారీలో ఉన్నాడు.వీరి వద్ద రూ.కోటి విలువచేసే 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ షాపూర్‌నగర్‌లోని డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఎస్వోటీ డీసీపీ డి.శ్రీనివాస్ తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నేహితుడి చేత డ్రగ్స్ తరలింపు తిరుపతికి చెందిన గుణశేఖర్ ఏపీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు ఉన్నం సురేంద్రకు డబ్బు ఆశచూపి మే 29న 820 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్ ఇచ్చి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు పంపించాడు. గుణశేఖర్ చెప్పినట్లుగానే సురేంద్ర కొకైన్ తీసుకుని గుంటూరు మీదుగా నగరంలోని కూకట్‌పల్లికి చేరుకున్నాడు. ఇక్కడ సురేంద్ర తన మనుషులైన బాపట్ల జిల్లాకు చెందిన దోతిరెడ్డి హరిబాబురెడ్డి, దేవరాజు యేసుబాబులను హైదరాబాద్ రప్పించాడు. అదేవిధంగా చేగూడి మెర్సి మార్గరెట్, షేక్ మస్తాన్ వలీలను సైతం పిలిపించుకున్నాడు. అందరూ కలిసి కూకట్‌పల్లిలోని జయనగర్‌లో కలుసుకున్నారు. జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పోలీసులు బిజీగా ఉంటారని భావించి ఆ రోజే కొకైన్ అమ్మేందుకు పథకం వేశారు. ఈ మేరకు ఐదుగురు కూకట్పల్లి భాగ్యనగర్ వైపు వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా కొకైన్ లభించింది. వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించి విచారించగా అసలు బండారం బయటపెట్టారు. అసలు డ్రగ్స్ వీరికి ఎక్కడ నుంచి వచ్చిoదనే విషయం తెలియలేదు. ప్రధాన నిందితుడు గుణశేఖర్ పోలీసులకు పట్టుబడితే అసలు విషయాలు బయటకు వస్తాయి. సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ రాజేశ్, బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్సై కట్కం గౌతం పాల్గొన్నారు. పోలీస్‌శాఖ ఆరా గుణశేఖర్ తిరుపతిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతను పంపిన మనుషులు డ్రగ్స్‌తో హైదరాబాద్‌లో పట్టుబడడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఘటనపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. దీనిపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మాట్లాడగా.. గుణశేఖర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని చెప్పారు. పోలీస్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇలా చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ గుణశేఖర్‌కు తిరుపతి ఎంపీ గురుమూర్తికి సంబంధాలు అంటగట్టే యత్నాలు జరుగుతుండడం అందరినీ విస్తుగొలుపుతోంది. కొన్ని నెలల క్రితం గుణశేఖర్ ఎంపీ వద్ద కొద్ది రోజులు గన్‌మేన్‌గా ఉద్యోగం నిర్వహించాడు. దానిని సాకుగా తీసుకుని ఈ కేసును ఎంపీకి అంటగట్టాలని కూటమి నేతలు యత్నించడం కుట్రపూరితమే. -
ప్రకాశం: మర్రిపూడి ఎస్ఐ దౌర్జన్యం కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రెడ్‌బుక్ రాజ్యాంగంలో సామాన్యుల పట్ల పోలీసుల దాడులు పెరిగిపోతున్నాయి ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెంలో మర్రిపూడి ఎస్ఐ ఎ.రమేష్‌బాబు మహిళపై దౌర్జన్యం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళపై చేయివేసి విసిరిపడేసి.. అమర్యాదగా ప్రవర్తించిన ఎస్సై రమేష్ బాబును ఎస్పీ వెనుకేసుకొచ్చారు.బాధితులపైనే కేసులు పెడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మీడియా ముందు ప్రకటించారు. దళిత ఎస్‌ను అడ్డగించి విధులకు ఆటంకం పరిచారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఇంటి యజమాని మారంరెడ్డి కొండలరావుపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.కాగా, ఈ కేసులో జాళ్లపాలెం గ్రామానికి చెందిన మారంరెడ్డి కొండలరావు అదేరోజు కొండపి పోలీస్‌స్టేషన్‌కు, ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో సోమవారం జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. జాళ్లపాలెంలో మారంరెడ్డి కొండలరావు నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. గత నెల 28న కొండపి మండలం పెట్లూరు శివాలయంలో రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ కొత్తపాలెం అంకమ్మ తల్లి ఆలయంలో రూ.70 వేల విలువైన వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి.ఈ కేసుల విచారణలో భాగంగా మర్రిపూడి ఎస్ఐ రమేష్‌బాబు జాళ్లపాలెం వెళ్లారు. కొండలరావు షాపు వద్ద సీసీ కెమెరా ఉన్నట్టు తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులను సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించాలని కోరారు. వారు యజమాని కొండలరావు లేరని చెప్పగా.. ఎస్సై రమేష్‌బాబు వెంటనే కొండలరావు కుమారుని ద్వారా ఫోన్ చేయించి అతడితో మాట్లాడారు. కొండలరావు ఎస్ఐతో మాట్లాడుతూ తాను ఊళ్లో లేనని, సాయంత్రం వస్తానని, పెన్‌డ్రైవ్ ఇస్తే సీసీ ఫుటేజీ కాపీ చేసి పంపిస్తానని మర్యాదపూర్వకంగా చెప్పారు.దీంతో ఎస్ఐ రమేష్‌బాబు తాను స్వయంగా సీసీ కెమెరా ఫుటేజీ చెక్ చేసుకుంటానని చెప్పడంతో ‘సార్ మీరు నా ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ మీద నాకు నమ్మకం లేదు’ అని చెప్పాడు. దీంతో అహం దెబ్బతిన్న ఎస్సై ‘మా మీద నమ్మకం లేదా’ అనడంతో కొండలరావు ‘నమ్మకం లేదు. గత ఏడాది నవంబర్‌లో మర్రిపూడి మండలం జగ్గరాజుపాలెం పెట్రోల్ బంకులో నాపై దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే నన్ను మూడు గంటలపాటు నిలువరించటమే కాక మీరు నేరస్తుల పక్షాన నిలబడి నాపై తప్పుడు కేసు పెట్టమని సలహా ఇచ్చారు.నేటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు’ అనడంతో ఎస్ఐ ఫోన్ కట్ చేశారు. తరువాత కొండలరావు కుటుంబ సభ్యులపై ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎంత పొగరు. తలుపులు వేసేస్తారా’ అని తలుపులు నెట్టుకుంటూ షాపులోకి వెళ్లి కుటుంబ సభ్యులను కొట్టారు. షాపులో ఉన్న కొండలరావు చెల్లెలు చంద్రమ్మను చేతితో నెట్టుకుంటూ ఆమెను దూషిస్తూ బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి సీసీటీవీ ఎన్వీఆర్, మొబైళ్లు, పెన్‌డ్రైవ్‌లు జేబులో వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై కొండలరావు కొండపి పోలీస్‌స్టేషన్‌లోను, ఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు న్యాయం జరగలేదని, తక్షణమే విచారించి న్యాయం చేయటంతో పాటు దోషులను శిక్షించి తమ వద్ద లూటీ చేసిన ఆస్తులను రికవరీ చేసి ఇప్పించాలని మరోమారు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
డైవర్షన్ గమనించలేదా?
రంగంపేట/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: అప్పటి వరకూ ఆనంద సాగరంలో ఓలలాడిన వారిన్ని విధి చిన్నచూపు చూసింది.. కొద్దిసేపటిలో ఇంటికి చేరుకునేవారే.. అయినవారితో సంతోషంగా గడిపేవారే.. కానీ, అంతలోనే వారిపై మృత్యువు పంజా విసింది.. రహదారిపై మృత్యుఘోష ప్రతిధ్వనించింది.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని నింపింది. అయినవారందరినీ శోక సంద్రంలో ముంచింది.ఏం జరిగిందంటే..ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు, గాయ పడిన వారు దగ్గర బంధువులు. రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ (40), ఆయన భార్య దేవీ లలిత (34), కుమార్తెలు వర్షిత (13), హర్షితతో పాటు.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన శివన్నారాయణ బావమరిది తీగిరెడ్డి శివ (30), ఆయన భార్య భవాని, వారి కుమార్తె సాన్వి (4) కలసి కారులో సోమవారం కాకినాడ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి వస్తున్న క్రమంలో వడిశలేరు గ్రామ సమీపాన హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న పాల ట్యాంకర్‌ను వేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు సగ భాగం ట్యాంకర్‌లోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్నారాయణ (40), దేవీ లలిత (34) దంపతులు, వారి కుమార్తె వర్షిత (13), తీగిరెడ్డి శివ (30), ఆయన కుమార్తె సాన్వి (4) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెనుక సీటులో కూర్చున్న శివ భార్య భవాని, శివన్నారాయణ కుమార్తె హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లు గీతపై ఆధారపడి ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శివ తండ్రి సూరిబాబు గత ఏడాది తాటిచెట్టు పైనుంచి పడి, మంచాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘోరం జరగడం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది. సరదాగా బీచ్‌కు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు ఇలా కనుమరుగైపోతారనుకోలేదంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.డైవర్షన్ గమనించలేదా?ఏడీబీ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో వడిశలేరు హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద అటుగా వెళ్లాల్సిన ట్రాఫిక్‌ను పక్క మార్గంలోకి మళ్లిస్తూ డైవర్షన్ ఇచ్చారు. దీనికి కొద్ది దూరంలోనే పాల ట్యాంకర్ ఆగి ఉంది. ప్రమాద సమయానికి శివన్నారాయణ కారు నడుపుతున్నారు. ఆయన ఆగి ఉన్న ట్యాంకర్‌ను, డైవర్షన్‌ను గమనించకుండా వేగంగా దూసుకుని రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయిపోయింది. రహదారిపై డైవర్షన్‌ను గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, అడిషనల్ ఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (క్రైం) ఎల్.అర్జున్, రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య, అనపర్తి సీఐ సుమంత్ సందర్శించారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను చూసి బంధువులు, కవలగొయ్యి, రఘునాథపురం గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వాసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే..మృతుడు శివన్నారాయణ కుమార్తెలు హర్షిత, వర్షితలు కవల పిల్లలు. 13వ సంవత్సరంలోకి వచ్చారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో ఆధార్ అయ్యేది కాదు. ఈ క్రమంలో కాకినాడలో ఇందుకు సంబంధించిన పని చేసే వారున్నారని వారికి తెలిసింద. బీచ్‌లో సరదాగా గడిపిన అనంతరం వారు హర్షిత ఆధార్ పని పూర్తి చేసుకోవాలని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఈ కవలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే ఇలా జరిగిందంటూ వారి బంధువులు కన్నీటి పర్యంతమవతున్నారు.