ఏసీఏ అండర్‌–15 వన్డే టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఏసీఏ అండర్‌–15 వన్డే టోర్నీ ప్రారంభం

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్‌–15 మహిళల రాష్ట్ర ప్రాబబుల్స్‌–2026 మూడో విడత వన్డే మ్యాచ్‌లు కడప నగర శివారులోని కేఓఆర్‌ఎం, కేఎస్‌ఆర్‌ఎం మైదానాల్లో ప్రారంభమయ్యాయి. తొలి రోజు పోటీల్లో టీమ్‌–బి, టీమ్‌–ఎ జట్లు విజయాలను అందుకున్నాయి.

ఉత్కంఠ పోరులో టీమ్‌–బి గెలుపు

కేఓఆర్‌ఎం మైదానంలో టీమ్‌–డి, టీమ్‌–బి జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌–డి 32.1 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. రక్షిత (57), లక్ష్య మోహన్‌ (23) రాణించారు. టీమ్‌–బి బౌలర్లలో అక్షర 3, కార్తీక 2 వికెట్లు తీశారు. అనంతరం 144 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌–బి 31.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి, 1 వికెట్‌ తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. జాహ్నవి యాదవ్‌ (54), కార్తీక (22) జట్టును గెలిపించారు. టీమ్‌–డి తరఫున మేఘన 3, లక్ష్య మోహన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

హర్షిత పోరాడినా తప్పని ఓటమి

కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో టీమ్‌–సిపై టీమ్‌–ఎ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌–సి నిర్ణీత 35 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆ జట్టులో హర్షిత గౌడ (73 బంతుల్లో 142; 11 ఫోర్లు, 11 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, భావన (26) సహకరించింది. టీమ్‌–ఎ బౌలర్లలో రితిక 3, మేఘన రెడ్డి 2 వికెట్లు దక్కించుకున్నారు. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌–ఎ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఆయాతి (74), విశ్వశ్రీ (65), అక్షయ (33) సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. టీమ్‌–సి బౌలర్‌ వర్షిణి 2 వికెట్లు తీసింది.

తొలి రోజు టీమ్‌–బి, టీమ్‌–ఎ జట్ల జయభేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement