ప్రాణాలమీదకు తెస్తున్న ‘సీ్త్ర’ శక్తిపథకం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలమీదకు తెస్తున్న ‘సీ్త్ర’ శక్తిపథకం

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

రాజంపేట : కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన ‘సీ్త్ర శక్తి’(ఉచిత బస్సు) పథకం సామాన్య మహిళల ప్రాణాల మీదకు తెస్తోంది. బస్సుల సంఖ్య పెంచకుండా పథకాన్ని అమలు చేస్తుండటంతో, సీటు దొరకదనే ఆదుర్దాలో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట పాత బస్టాండ్‌లో బస్సు ఎక్కుతూ ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.

అసలేం జరిగిందంటే..

పెనగలూరు మండలం బుడ్డగారిపల్లెకు చెందిన రసూల్‌బీ (65) కడపకు వెళ్లేందుకు రాజంపేట పాత బస్టాండ్‌కు చేరుకుంది. బస్సు రాగానే, విపరీతమైన రద్దీ కారణంగా సీటు దొరకదేమోనన్న ఆందోళనతో ఆమె ఆదుర్దాగా బస్సు ఎక్కే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. అదే సమయంలో బస్సు ముందుకు కదలడంతో వెనుక టైరు ఆమె ఎడమ కాలుపై నుంచి వెళ్లింది.టైరు ఎక్కడంతో వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జయి, రక్తస్రావంతో ఆమె నడిరోడ్డుపై విలవిలలాడారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సరైన ఏర్పాట్లు లేకుండా పథకాన్ని అమలు చేస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇరువర్గాల ఘర్షణ:10 మందిపై కేసు

కొండాపురం : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కొండాపురం మండలం పొట్టిపాడు క్లస్టర్‌లో శనివారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి కొండాపురం ఎస్‌ఐ జి. నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిపాడులో కూటమి వర్గీయులకు, రెబల్‌ అభ్యర్థులకు మధ్య నామినేషన్ల దాఖలు విషయంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. ఘర్షణకు పాల్పడిన ఇరువర్గాలకు చెందిన 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement