రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

వల్లూరు: కడప– తాడిపత్రి ప్రధాన రహదారిలో వల్లూరు మండల పరిధిలో విమానాశ్రయం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్లపల్లి సరస్వతి అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కమలాపురం పట్టణంలోని గిడ్డంగి వీధికి చెందిన వడ్లపల్లి శివ తన భార్య సరస్వతితో కలిసి ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా విమానాశ్రయం సమీపంలో ఆమె చీర కొంగు బైక్‌ చక్రానికి చుట్టుకుంది. దీంతో ఆమె కిందపడింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స కోసం ఆమెను కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement