కమిషనర్‌ మెడకు చుట్టుకున్న ఎగ్జిబిషన్‌ బకాయిలు | - | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ మెడకు చుట్టుకున్న ఎగ్జిబిషన్‌ బకాయిలు

Nov 16 2026 1:20 AM | Updated on Nov 16 2026 1:20 AM

ప్రొద్దుటూరు : మున్సిపల్‌ ఎగ్జిబిషన్‌ బకాయిలు కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ మెడకు చుట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. బకాయిలు కట్టాల్సిందేనని కమిషనర్‌, డబ్బు కట్టకుండానే ఎగ్జిబిషన్‌ సామగ్రిని తరలించేందుకు అధికార పార్టీ నేత ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎగ్జిబిషన్‌ వేలం పూర్తయిన ఐదు రోజుల్లోపు పూర్తి మొత్తాన్ని వేలం పాటదారుడు చెల్లించాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా కాంట్రాక్టర్‌ కొంత మొత్తాన్ని చెల్లించి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించాడు. మొత్తం రూ.2.18 కోట్లు బకాయిలు కట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.55 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇచ్చిన గడువు ప్రకారం ఈనెల 26వ తేదీ నాటికి 45 రోజులు పూర్తవుతుంది. డబ్బు చెల్లించని కాంట్రాక్టర్‌ గడువు పూర్తవుతుండటంతో ఒక్కొక్కటిగా ఎగ్జిబిషన్‌లోని సామగ్రిని తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నాలుగు రోజుల క్రితం మున్సిపల్‌ అధికారులు సామాగ్రి తరలింపును అడ్డుకున్నారు. అధికారులు ఎంత ఒత్తిడి చేసినా బకాయిలు చెల్లించని కాంట్రాక్టర్‌ తన సామగ్రిని తరలించేందుకు ఆదివారం మరో మారు ప్రయత్నాలు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజూనాథ్‌ గౌడ్‌, సచివాలయ సిబ్బంది ఎగ్జిబిషన్‌కు వెళ్లి కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. బకాయిలు చెల్లించకుండా ఒక్క సామాగ్రిని కూడా తరించేందుకు వీలులేదని తెలిపారు. త్రీటౌన్‌ పోలీసులను ఎగ్జిబిషన్‌ వద్ద కాపలా ఉంచారు.

అధికార పార్టీ నేతే కాంట్రాక్టర్‌

ఎగ్జిబిషన్‌ వేలం సమయంలో అత్యధిక ధర పాడి శివకుమార్‌ అనే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం ఎగ్జిబిషన్‌ను మాత్రం మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన గుర్రప్ప అలియాస్‌ గురివిరెడ్డి నిర్వహిస్తున్నాడు. ఆదివారం కమిషనర్‌ వెళ్లినప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. మీతో తనకు సంబంధం లేదని, కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చామని కమిషనర్‌ తెలపగా సంఘటన స్థలంలో ఉన్న గురివిరెడ్డి ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న ఎగ్జిబిషన్‌ సామాగ్రిని తరలించాల్సిందేనని కమిషనర్‌తో అన్నారు. తనకు కాంట్రాక్టర్‌ శివకుమార్‌ సమాధానం చెప్పాలని, నీతో సంబంధం లేదని కమిషనర్‌ తెలిపారు. కాంట్రాక్టర్‌ ఎగ్జిబిషన్‌ డబ్బు చెల్లించాల్సిందేనని టీడీపీకి చెందిన మరో వర్గం వారు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. లేకుంటే కమిషనరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నారు. అనంతపురం మున్సిపల్‌ రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌కు ఎగ్జిబిషన్‌ బకాయిలపై ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా ఎగ్జిబిషన్‌ బకాయిల వసూలు మున్సిపల్‌ కమిషనర్‌ మెడకు చుట్టుకున్నాయని చెప్పక తప్పదు.

సామగ్రిని తరలించేందుకు అధికార పార్టీ నేత యత్నం

అడ్డుకున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement