మైదుకూరు : ఆర్యవైశ్య అఫిషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆవోపా) జిల్లా నూతన అధ్యక్షుడిగా పులివెందులకు చెందిన మేడం దినేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆవోపా సర్వసభ్య సమావేశం ఆదివారం మైదుకూరు అధ్యక్షుడు దరిశా శ్రీనివాసులు అధ్యక్షతన మైదుకూరులో జరిగింది. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గూడూరు హరికృష్ణ జిల్లాలోని 11 ఆవోపా యూనిట్ల పీఎస్టీలు రెండేళ్లలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారంతా మేడం దినేష్ కుమార్‌ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కొత్త అధ్యక్షునికి సభికులందరూ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఆవోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టెం రమేష్, సలహాదారుడు సీఏ ప్రసాద్, కృష్ణదేవరాయ, రీజియన్ కన్వీనర్ దరిశా వెంకట అన్వేష్, మాలేపాటి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.
గోపవరం : మండల తహసీల్దారు జీవన్‌చంద్రశేఖర్ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆయన కిడ్నీవ్యాధికి గురై వేలూరు సీఎంసీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన బద్వేలు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓగా పనిచేశారు. రెగ్యులర్ తహసీల్దార్‌గా గోపవరంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన కిడ్నీవ్యాధికి గురై సెలవుపై వెళ్లారు. సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళారు. చికిత్స పొందుతూ మృతిచెందారు.
విద్యార్థుల భాగస్వామ్యంతోనే ఉద్యమాలు విజయవంతం
మదనపల్లె (కురబలకోట): సమాజ హితం, సామాజిక న్యాయం, సమానత్వ సాధన కోసం భవిష్యత్తు ఉద్యమాలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. నరేంద్రబాబు మాదిగ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి కె. సంజీవ మాదిగ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగించిన సుదీర్ఘ పోరాటంలో మాదిగ విద్యార్థులు కీలక పాత్ర పోషించార న్నారు. ప్రపంచంలో ఏ ఉద్యమం విజయవంతమైనా దాని వెనుక విద్యార్థి శక్తి ఉంటుందన్నారు. అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా భవిష్యత్తు ఉద్యమాలు సాగాలన్నారు. ప్రతి విద్యా సంస్థ, హాస్టల్‌తో పాటు గ్రామాలు, మండలాల్లో ఎంఎస్‌ఎఫ్ నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. నవంబరు 20లోపు విద్యార్థులతో క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించి వారిలో సామాజిక చైతన్యం పెంపొందిస్తూ భవిష్యత్ ఉద్యమాలకు సిద్దం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ, ఎంఎస్‌ఎఫ్ జిల్లా, నియోజక వర్గ, మండల నాయకులు పాల్గొన్నారు.


