సబ్సిడీ విత్తనాల కోసం రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ విత్తనాల కోసం రైతుల ఆందోళన

Oct 28 2026 5:54 AM | Updated on Oct 28 2026 5:54 AM

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని మాలెపాడు గ్రామానికి చెందిన రైతులు తమకు సబ్సిడీ శనగ విత్తనాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకరాకు రెండు శనగ ప్యాకెట్లు ఇవ్వాలని తెలిపారు. కానీ ఇక్కడ మాత్రం ఎకరాకు ఒక ప్యాకెట్‌ ఇస్తుండటంతో తీసుకోలేదన్నారు. ప్రస్తుతం అరకొర వర్షాలు పడటంతో భూమిని దుక్కి దున్ని విత్తనం విత్తడానికి సిద్ధమైనట్లు తెలిపారు. ఒక ప్యాకెట్‌ ఇస్తే తమకు ఏమూలకు సరిపోవన్నారు. అందుకే ప్రభుత్వం సూచించిన మేరకు ఎకరాకు రెండు ప్యాకెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై రైతు భరోసా కేంద్రం అధికారులు స్పందిస్తూ.. మాలెపాడు గ్రామ పరిధిలో ఉన్న సాగు భూమి ప్రకారం తీసుకుంటే 3000 బస్తాలు అవసరం అవుతాయని, కానీ ప్రభుత్వం 1500 బస్తాలు మాత్రమే మంజూరు చేసినట్లు తెలిపారు. అందుకే ఎకరాకు ఒక ప్యాకెటు ఇస్తుండటంతో రైతులు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారిణి సుజనకుమారీని వివరణ కోరగా.. మండలానికి ప్రభుత్వం నుంచి సుమారు 3000 క్వింటాళ్లు వచ్చాయని, అదనంగా మరో 600 క్వింటాళ్లు వస్తాయన్నారు. సర్దుబాటు చేసి రైతులందరికీ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement