భక్తిశ్రద్ధలతో తహలీల్‌ ఫాతెహా | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో తహలీల్‌ ఫాతెహా

Oct 28 2026 6:12 AM | Updated on Oct 28 2026 6:12 AM

న్యూస్‌రీల్‌

కడప సిటీ: కడప అమీన్‌పీర్‌ దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తహలీల్‌ ఫాతెహా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ తమ స్వగృహంనుంచి ఫకీర్ల మేళతాళాలు, విన్యాసాల మధ్య ఊరేగింపుగా మహానైవేద్యంగల పవిత్రమైన పాత్రను దర్గా ప్రాంగణంలోకి తీసుకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాత్రలోని నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టారు. ఉరుసు ఉత్సవాల ప్రారంభంరోజు తపోదీక్ష వహించిన మలంగ్‌షా మంగళవారం దీక్ష విరమించారు. పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ శిష్య గణంతో కలిసి ఊరేగింపుగా వెళ్లి మలంగ్‌షాను స్వయంగా దీక్ష విరమింపజేశారు.

సినీనటుడు బోమన్‌ ఇరాని

ప్రత్యేక ప్రార్థనలు

ప్రముఖ సినీ నటుడు, విలన్‌ బోమన్‌ ఇరాని పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. దర్గాకు చేరుకున్న ఆయనకు దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి సంప్రదాయంగా పేటా అలంకరించి దర్గాలోనిప్రధాన గురువుల మజార్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం ఆయన ముషాయిరాలో పాల్గొన్నారు.

జిల్లాలో ముగిసిన

జెడ్పీటీసీ నామినేషన్ల పర్వం

– 23 మంది ఏకగ్రీవం

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలో జరిగిన జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్పీటీసీ) నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. అందులో భాగంగా జిల్లాలోని 39 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను ఆహ్వానించారు. ఈనెల 21 నుంచి 23వ తేది వరకు కడపలోని జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం 24, 25 తేదీల్లో నామినేషన్ల పరిశీలన జరిగింది. 27వ తేది మంగళవారం నామినేషన్ల ఉపసంహరణతోపాటు అభ్యర్థులు బి.ఫారాన్ని సమర్పించారు. దీంతో 23 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 16 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఎంబీఏ లో మిగులు సీట్ల కోసం ప్రవేశాలు

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ ఎంబీఏ (జనరల్‌), (హెచ్‌ ఆర్‌), ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) కోర్సులలో మిగులు సీట్ల ప్రవేశానికి నవంబర్‌ 2వ తేదీ వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు ప్రొ.వి. రామకృష్ణ తెలిపారు. విద్యార్థులకు స్పాన్సర్డ్‌ కోటాలో ప్రవేశాలు ఉన్నాయన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, నిర్ణీత ఫీజుతో వైవీయూలోని డైరెక్టరేట్‌లో అభ్యర్థులు హాజరు కావాలన్నారు.

బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన తీరును వివరిస్తుంటే...ప్రతి ఒక్కరి మనసుల్లో ఆలోచన

కలిగించింది. పార్టీ కార్యకర్తలకు నిండు భరోసా కలిగింది.

జననాయకుడిగా పులివెందుల గడ్డ నుంచే

‘పోరు’కు సై అంటూ సవాల్‌ విసరడంతో

అభిమానగణం మురిసిపోయింది.

సాక్షి కడప : ‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు అంతేలేదు. ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం....రౌడీయిజం, గుండాయిజం చేస్తూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్‌ పత్రాలు చించివేస్తూ వికృత చేష్టలు చేశారు.. నామినేషన్‌ కేంద్రం వద్ద బారికేడ్లు దాటుకుని ముందుకు వెళితే పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు సృష్టించారు. చివరికి కేంద్రాలకు వెళ్లినా లోపల రిటర్నింగ్‌ అధికారులు కూడా నామినేషన్‌ విషయంలో తేడాలు చూపించారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల సందర్భంగా అక్కడో, ఎక్కడో పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ చేసుకున్నట్లు విన్నాం. కానీ, నామినేషన్లే వేయనీయకుండా అడ్డుపడటం ఇప్పుడు చూస్తున్నాం.. నామినేషన్‌ కాకుండా సెలెక్షన్‌ అని పెట్టుకుంటే బాగుండేది. అప్పుడు ఎవరిని కావాలంటే వారిని సెలెక్ట్‌ చేసుకోవచ్చు.. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోతోంది’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పులివెందులలో మాట్లాడుతూ నామినేషన్స్‌ వేయనీయకుండా అడ్డుకునే బదులు నేరుగా నామినేట్‌ చేసుకుంటే పోతుంది కదా అని సీఎం చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల ఆస్తిపాస్తులకు రక్షణ ఉండదని ఇప్పటికై నా ప్రజలు ఏకతాటిపై నిలిచి హక్కుల కోసం పోరాటం చేసేందుకు కలిసి రావాలని జగన్‌ పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి..

జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు. అందుకు సంబంధించి మంగళవారం పులివెందులలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మున్సిపల్‌ ఇన్‌ఛార్జిలు చవ్యా దుష్యంత్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్‌ మధురెడ్డిలతో కలిసి తొలుత పులివెందుల మున్సిపల్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోటీ లో ఉన్న అభ్యర్థులతోపాటు వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీలమ్మ, కడప మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డితోపాటు కార్పొరేటర్‌ అభ్యర్థులు, జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బరిలో ఉన్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరారు. నామినేషన్లు వేయడం కోసం అభ్యర్థులు పడిన కష్టాలు తెలుసు... ఎన్నికలతోపాటు కౌంటింగ్‌ సందర్భంలోనూ టీడీపీ నేతలు ఇబ్బందులు పెడతారని తెలిసినా పోరాటం చేస్తున్న అందరికీ అభినందనలు తెలిపారు. గుండె ధైర్యంతో అడుగు ముందుకు వేయడమే మన కర్తవ్యమని హితబోధ చేశారు.

పులివెందులలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ సందర్భంలో జరిగిన పోలీసుల దాడుల్లో గాయపడిన పులివెందుల మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ హఫీజ్‌ను మంగళవారం ఫోన్‌లో వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్తులను కూడా లాక్కుంటారు

న్యాయం కోసం గట్టిగా నిలబడి పోరాడాలి

కడపతోపాటు పులివెందులలో న్యాయం, ధర్మం గెలవాలి

ఎన్ని కష్టాలు ఎదురైనా గుండె ధైర్యంతో ముందడుగు వేయండి

పులివెందుల, కడప మున్సిపల్‌ అభ్యర్థులు, కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

నామినేషన్లను అడ్డుకోవడం...

దాడులకు తెగబడిన ఘటనలపై ఆరా

అన్నింటికి సమాధానం

జగన్‌ 2.0లో చెబుదాం

క్యాంపు కార్యాలయంలో ప్రజలు,

కార్యకర్తలతో మమేకమైన వైఎస్‌ జగన్‌

పచ్చ నేతల అరాచకాలపై దునుమాడుతుంటే..

అభిమానుల్లో కసి రెండింతలైంది..

ఖాకీల కుతంత్రాలపై నిప్పులు చెరుగుతుంటే..

పార్టీ నేతల కళ్లల్లో ఎరుపొచ్చింది...

‘మీకు తోడుగా ఈ అన్న ఉన్నాడ’న్నప్పుడు..

కార్యకర్తల ఒంటి నిండా ధైర్యం వచ్చింది...

‘మీ మీద చేయి వేస్తే..నా మీద వేసినట్లే..’ అన్నప్పుడు

అభిమానుల గుండె ఉప్పొంగింది..

‘పోలింగ్‌ రోజు నేనుంటా.. ఎవరొస్తారో..ఎంతమంది వస్తారో

అన్యాయం చేస్తారా... రాండి’ అని సవాల్‌ విసురుతుంటే..

అభిమానగణంలో ఉత్సాహం ఉరకలెత్తింది..

‘కష్టకాలంలో తోడుగా ఉన్న మీకు రుణపడి ఉంటా’ అన్నప్పుడు..

పులివెందుల నేల భావోద్వేగంతో తడిసి ముద్దయ్యింది..

‘మా జగన్‌.. మా నాయకుడు’ అని

ఈలలతో.. చప్పట్లతో ఆ ప్రాంతం మార్మోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement