బాలల హక్కుల పరిరక్షణకు న్యాయ సాయం | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల పరిరక్షణకు న్యాయ సాయం

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

కడప అర్బన్‌ : బాలల హక్కులను పరిరక్షించడంతోపాటు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మేధో వైకల్యాలు కలిగిన వ్యక్తులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.బాబా ఫక్రుద్దీన్‌ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్‌ సూచనలతో సోమవారం కడప కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో పిల్లల కోసం న్యాయ సేవా విభాగం (ఎల్‌ఎస్‌యూసీ), మానసిక అనారోగ్యం, మేధో వైకల్యాలు కలిగిన వ్యక్తుల కోసం న్యాయ సేవా విభాగం (ఎల్‌ఎస్‌యూఎం)పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ ఎస్‌.ప్రసాద్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిళ్లు, ప్యానెల్‌ న్యాయవాదులు, పోలీసు అధికారులు, జైలు సూపరింటెండెంట్లు, పారా లీగల్‌ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement