బాలిక అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

మైదుకూరు : తన కుమార్తె కనిపించడం లేదని ఆచూకీ కనుగొనాలని కోరుతూ మైదుకూరు మండల జాండ్లవరం ఎస్టీ కాలనీకి చెందిన చెడమల రమాదేవి సోమవారం అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో తన కుమార్తె శ్రీలత(18) ఇంటర్‌ చదువుతోందని, ఈనెల 19వ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో తెలిపింది. తమ ఇంటికి ఎదురుగా ఉన్న బంధువైన చెడమల శ్రీనివాసులుతో వెళ్లిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఆ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి

కడప అర్బన్‌ : రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆకాంక్షించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రామాయణాన్ని రచించి యుగాలు మారినా ఆదర్శంగా నిలిచే విధంగా వాల్మీకి మహర్షి సమాజానికి అందించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్‌ బాబు, ఏఆర్‌ అదనపు ఎస్పీ బి. రమణయ్య, ఏఆర్‌ డీఎస్పీ నాగేశ్వర రావు, కడప డీఎస్పీ టి.భవాని, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉత్సాహంగా

ఎస్‌జీఎఫ్‌ ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్‌జీఎఫ్‌) అండర్‌ –19 జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. సోమవారం కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో రెజ్లింగ్‌ ఫ్రీ స్టైల్‌, రెజ్లింగ్‌ గ్రీకో రోమన్‌, కలరిపయట్టు, పరుగు పందెం బాల బాలికల జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్‌ అండర్‌– 19 జిల్లా సెక్రటరీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు మహేశ్వర్‌రెడ్డి, వెంకటలక్ష్మి, ఫాతిమా పాల్గొన్నారు.

అండర్‌ –14, 17 విభాగాలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌)లో భాగంగా అండర్‌ –14, 17 జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగినట్లు ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14, 17 జిల్లా సెక్రటరీలు విజయలక్ష్మి, నాగరాజరెడ్డి తెలిపారు. సోమవారం కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో ఖోఖో, యోగా, వాలీబాల్‌ బాలబాలికల జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1000 మంది క్రీడాకారుల హాజరయ్యారు.

ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం

తొండూరు : మండలంలోని మల్లెల బస్టాప్‌ వద్ద సోమవారం రాత్రి ఆటో ఢీకొని చవ్వల విశ్వనాథ్‌(19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథలు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తండ్రి నాగభూషణం రోడ్డు అవతల వైపు ఉండగా.. విశ్వనాథ్‌ తండ్రి దగ్గరికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ట్రాక్టర్‌ వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement