‘డీఏవీ భారతి’ విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

‘డీఏవీ భారతి’ విద్యార్థి ప్రతిభ

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిధిలోని డీఏవీ భారతి విద్యా మందిర్‌ విద్యార్థి ఎస్‌ఎంవీఎస్‌ కౌశిక్‌(10వ తరగతి) రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ చెస్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్‌ శివ్వం కిషోర్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన కడప నగరంలోని డీఎస్‌ఏ మున్సిపల్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన అండర్‌–17 బాలుర విభాగం జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ చెస్‌ పోటీల్లో పాల్గొన్న కౌశిక్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు తరఫున తమ విద్యార్థి ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. కాగా ప్లాంట్‌ హెడ్‌ రామమూర్తి, ఇతర ప్రతినిధులు గౌరీ పరమేశ్వరరావు, భార్గవ్‌రెడ్డి, ప్రాంతీయ అధికారి శేషాద్రి, ప్రిన్సిపల్‌ కిషోర్‌ కుమార్‌ తదితరులు విజేతతోపాటు పీఈటీ చందును అభినందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సైతం ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని సూచించారు.

రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement