ప్రైవేటుకు ఎలక్ట్రిక్‌ బస్సులు వద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు ఎలక్ట్రిక్‌ బస్సులు వద్దు

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

ప్రైవేటుకు ఎలక్ట్రిక్‌ బస్సులు వద్దు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా 1,450 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య పేర్కొన్నారు. అవసరమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని కోరారు. ఆదివారం కడపలోని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జోనల్‌ కార్యాలయంలో కడప డిపో జనరల్‌ బాడీ సమావేశం ఈయూ కడప జిల్లా జాయింట్‌ సెక్రటరీ జి.బాలవెంకటేష్‌ అధ్యక్షతన, డిపో అధ్యక్ష కార్యదర్శిలు ఇ.రాము, ఎ.శ్రీనివాసరెడ్డి ఆధ్యర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీ నరసయ్య మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులు, డిపోలు, రూట్లు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని స్పష్టం చేశారు. విద్యుత్‌ బస్సుల ప్రవేశం నేపథ్యంలో మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం డిపోలను ఆరు నెలల్లో పునఃప్రారంభిస్తామని ఆర్టీసీ జేఏసీకి వీసీ అండ్‌ ఎండీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే అవసరమైన చర్యలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను భర్తీ చేయాలని, సీ్త్రశక్తి పథకం వల్ల పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కనీసం 4 వేల కొత్త బస్సులను సమకూర్చాలని పేర్కొన్నారు. ఏపీ పీడీడీ(ఆర్టీసీ) ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం జారీ చేసిన సర్క్యులర్‌ నంబర్‌ 01/2019ను అమలు చేస్తామని ఎండీ రాత పూర్వకంగా అంగీకరించిన దానిని ఉల్లంఘిస్తూ ఉద్యోగులకు చాలా మంది అధికారులు అన్యాయం చేస్తున్నారని, ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా కార్యదర్శి కేకే కుమార్‌, ఈయూ జిల్లా అధ్యక్షుడు జి.బోసుబాబు, జిల్లా కార్యదర్శి ఎ.ఆర్‌.మూర్తి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున, చీఫ్‌–వైస్‌ ప్రెసిడెంట్‌ బి.చెన్నయ్య గ్యారేజ్‌ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, మహిళా కార్యకర్తలు, ఈయూ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement