నామినేషన్లు వేయడంలో వెన్నుపోటు! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లు వేయడంలో వెన్నుపోటు!

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

● 9 చోట్ల వైఎస్సార్‌సీపీ పేరుతో

నామినేషన్లు వేసిన టీడీపీ వర్గీయులు

చాపాడు : నామినేషన్లు వేయడంలోనూ టీడీపీ వెన్నుపోటు పొడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు గత మూడు రోజులుగా నామినేషన్లు జరిగాయి. ఈ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు రోజులుగా మైదుకూరులో రెండు చోట్ల మినహా మిగిలిన ఐదు మండలాల్లో ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ వర్గీయుడిని టీడీపీ మూకలు నామినేషన్లు వేయించలేదు. ఎన్నికల కమిషన్‌ను నమ్మించేందుకు టీడీపీ వర్గీయులే నియోజకవర్గంలోని 9 చోట్ల వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు వేశారు. మైదుకూరు మండలంలో అన్నలూరు, గంజికుంట, తిప్పిరెడ్డిపల్లె, ఖాజీపేట మండలంలో తవ్వారుపల్లె, త్రిపురవరం, ఖాజీపేట–1, ఖాజీపేట–2, చాపాడు మండలంలో అల్లాడుపల్లె, బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లె ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ వర్గీయులు వారి వ్యక్తులతో వైఎస్సార్‌సీపీ పేరుతో ఆయా స్థానాలకు నామినేషన్లను వేయించారు. నామినేషన్లు వేయించక ముందే ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించుకుని నామినేషన్లు వేయించడం గమనార్హం. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను పోలీసులు మూడు రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకోవడం, నామినేషన్‌ వేసేందుకు వచ్చే వారిపై టీడీపీ మూకలు దాడులకు పాల్పడటం, నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించేయడం వంటి పనులకు పాల్పడ్డారు. చాపాడు మండలం పల్లవోలు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన దోనాది ఆదినారాయణ, ఆయన భార్య నరసమ్మ, తమ మద్దతుదారులపై ఆ గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు దాడులకు పాల్పడి నామినేషన్‌ పత్రాలు చించేశారు. మైదుకూరు నియోజకవర్గంలో 61 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మైదుకూరు మండలంలో రెండు చోట్ల మాత్రమే వైఎస్సార్‌సీపీ వర్గీయులు నామినేషన్‌ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement