జర్నలిస్టుపై అల్లరి మూకల దాడి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుపై అల్లరి మూకల దాడి

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

● నామినేషన్‌ కేంద్రం సమీపంలో

కవరేజ్‌ చేస్తుండగా దౌర్జన్యం

కడప అర్బన్‌ : కడప నగరంలోని జెడ్పీ కార్యాలయం నామినేషన్ల కేంద్రం వద్ద వీడియో కవరేజీ చేస్తున్న ఓ మీడియా ప్రతినిధి జాల సుందర్‌రావుపై శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో అల్లరి మూకలు చొక్కా పట్టుకుని దాడి చేశారు. వీడియో కవరేజ్‌కి ఉపయోగించిన సెల్‌ ఫోన్‌ను లాక్కొని బలవంతంగా అందులోని వీడియోలను, ఫొటోలను డిలీట్‌ చేశారు. అంతటితో ఆగక దౌర్జన్యం చేశారు. ఇంతలోపు సహచర జర్నలిస్టులు అడ్డుకోవడంతో పరారయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే జర్నలిస్టులు మూకుమ్మడిగా జెడ్పీ కార్యాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకుని.. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని, సీనియర్‌ జర్నలిస్టు సుందర్‌రావుపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన వద్దకు కడప డీఎస్పీ టి భవాని, కడప వన్‌టౌన్‌ సీఐ తిమ్మారెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది చేరుకున్నారు. జర్నలిస్టుల డిమాండ్‌ మేరకు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

కేసు నమోదు

సీనియర్‌ జర్నలిస్ట్‌ సుందర్‌రావుపై దాడి చేసిన అల్లరిమూకలపై బాధితుడి ఫిర్యాదు మేరకు కడప వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిమ్మారెడ్డి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement