కోర్టు ఆదేశాలతో నామినేషన్లు ! | - | Sakshi
Sakshi News home page

కోర్టు ఆదేశాలతో నామినేషన్లు !

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

నామినేషన్‌ వేసేందుకు వచ్చిన పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులు

జిల్లా పార్టీ ఆఫీసులో అభ్యర్థులకు సూచనలు ఇస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

కడపకార్పొరేషన్‌: కోర్టులు చీవాట్లు పెట్టడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఉదయం 10.50 గంటలకు పోలీసు వాహనంలో ఐదుగురు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మరో పోలీసు వాహనంలో 12 మందిని తరలించారు. కాగా అంతకుముందు జెడ్పీటీసీ అభ్యర్థులకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్లు వేయించాలని హైకోర్టు నిన్న రాత్రి ఆదేశాలిచ్చిందని, కోర్టు ఆదేశాల మేరకు ఎస్పీ, డీఎస్పీలు నామినేషన్లు వేయిస్తామ ని హామీ ఇచ్చారన్నారు. నామినేషన్లు వేయడానికి సాయంత్రం వరకూ వేచి చూసి మళ్లీ ఈ రోజు నామినేషన్లు వేయాలన్న పట్టుదలతో వచ్చిన అందరికీ ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు ఏ. మల్లికార్జునరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు రాజోలి వీరారెడ్డి పాల్గొన్నారు.

4 మండలాల అభ్యర్థుల నామినేషన్లు చించివేత

కాగా మూడో విడత మధ్యాహ్నం 2.40 గంటలకు వాహనంలో కాకుండా అభ్యర్థులను నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు చెప్పారు. ఈ మేరకు నడుచుకుంటూ నామినేషన్‌ కేంద్రానికి వెళ్తున్న చింతకొమ్మదిన్నె, చెన్నూరు, వీరపునాయినిపల్లె, సింహాద్రిపురం మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను టీడీపీ గూండాలు లాక్కొని చించివేశారు. ఇదేమి ప్రజాస్వామ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయానికి వెనుదిరిగారు. కోర్టుకు ఆధారాలు సమర్పించేందుకే పోలీసులు ఉదయం వాహనాల్లో తీసుకుపోయారని, మధ్యాహ్నం తర్వాత నడుచుకుంటూ పోవాలని చెప్పారని విమర్శించారు. నామినేషన్‌ వేసిన కొందరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు రిటర్నింగ్‌ అఽధికారులు చెక్‌లిస్టు ఇవ్వలేదు. నామినేషన్లను స్క్రూట్నీలో తిరస్కరించేందుకే ఇలా చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement