ఎన్నికలను అపహాస్యం చేశారు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలను అపహాస్యం చేశారు

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

కడప కార్పొరేషన్‌: కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 66 వార్డులు ఉండగా, రెండు, మూడు మినహా ఏ వార్డుల్లోనూ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయలేదని, కాబట్టి అన్ని వార్డుల్లో మళ్లీ నామినేషన్లు స్వీకరించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం కార్యాలయం వద్ద జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కేంద్రం కడపలో కేవలం 11 వార్డులు, రాజంపేటలో–11 వార్డుల్లోనే నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పించడం అన్యాయమన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం ధిక్కరించేలా వ్యవహరించిందని, దీనిపై మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికలు నిర్వహిస్తోందని మండిపడ్డారు. నామినేషన్లు వేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలని నిన్న రాత్రి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని... అయినా నామినేషన్‌కేంద్రం చుట్టూ టీడీపీ గూండాలు, రౌడీలు మోహరించారన్నారు. నామినేషన్‌ కేంద్రంలో రిటర్నింగ్‌ అధికారుల టేబుళ్ల వద్ద వీరికేం పని అని ప్రశ్నించారు.

కడప వైఎస్సార్‌సీపీకి కంచుకోట

కడప జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోట అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవకాశమిస్తే ఒక్కో వార్డులో వంద నామినేషన్లు వేసేందుకై నా తమ అభ్యర్థులు సిద్దంగా ఉన్నారన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపితే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. నామినేషన్లలో మరో కొత్త మోసానికి టీడీపీ తెరలేపిందని, డూప్లికేట్‌ గాళ్లతో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు వేయిస్తున్నారన్నారు. న్యాయస్థానాలను, ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించేందుకు ఏ– ఫారా లు, బీ– ఫారాలు లేకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తున్నారని తూర్పారబట్టారు.

జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామికం

కడప జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగే జడ్పీటీసీ ఎన్నికలను మురళి థియేటర్‌ వద్ద నుంచి కవరేజ్‌ చేస్తున్న ఓ మీడియా రిపోర్టర్‌ సుందర్‌పై అల్లరి మూకలు దాడి చేసి, ఆయన సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కోని దాడి చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్‌ రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని.. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కడపలో అన్ని వార్డులకు

నామినేషన్లు స్వీకరించాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

పి. రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌

నామినేషన్లు వేసేవరకూ

వెనక్కు తగ్గే ప్రశ్నేలేదని స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement