ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

కడప ఎడ్యుకేషన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ చివరిరోజైన శుక్రవారం ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్‌లో నామినేషన్ల ప్రక్రియను వారు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు విధులు నిర్వర్తించాలని ఆదేశించామన్నారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన వంటివి నిర్వహిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సదుపాయాలతోపాటు బ్యాలెట్‌ పెట్టెల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే అదికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రతా పరమైన ఆందోళన ఉంటే అభ్యర్థులు పోలీసు కంట్రోల్‌ రూమును సంప్రదించాలని కోరారు. ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ నామినేషన్‌ కేంద్రాల వద్ద తగినంత పోలీసు సిబ్బందిని నియమించామన్నారు.

పురపాలికలకు నామినేషన్ల దాఖలు

కడప సెవెన్‌రోడ్స్‌ : పురపాలక సంఘాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. కడప నగర పాలక సంస్థ పరిధిలోని 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55 డివిజన్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టరేట్‌ సభా భవనంలో ఏర్పాటు చేశారు. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో రాజంపేట పురపాలక సంఘానికి, పీజీఆర్‌ఎస్‌ హాలులో మైదుకూరు పురపాలక సంఘానికి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా పరిశీలించారు. శనివారం సాయంత్రం 3 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement