పోలీసుల త్యాగాలు అజరామరం | - | Sakshi
Sakshi News home page

పోలీసుల త్యాగాలు అజరామరం

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

కడప అర్బన్‌ : ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణలో పోలీసుల సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కడప పోలీసు పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్మృతి పరేడ్‌లో పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్‌ 21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల భద్రతకు అంకితమవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో ఎనిమిది మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ బి.రమణయ్య దేశవ్యాప్తంగా గత ఏడాది కాలంలో అమరులైన 154 మంది పోలీసుల పేర్లను చదివి వినిపించారు. జిల్లాలో అమరులైన ఎనిమిది మంది పోలీసుల కుటుంబ సభ్యులకు ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్‌ అదనపు ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌, కడప డీఎస్పీ టి.భవాని, ఎస్‌.బి సీఐ రెడ్డెప్ప, ఆర్‌.ఐలు సోమశేఖర్‌ నాయక్‌, పెద్దయ్య పాల్గొన్నారు.

ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement