మైదుకూరు : మైదుకూరు మన్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియ రెండోరోజున సజావుగా మొదలైంది. ఎమ్మెల్యే పుట్టా సుదాకర్‌యాదవ్ రావడంతో గందరగోళానికి దారితీసింది. ఆయన వెంట వందలాది మంది కార్యకర్తలను తీసుకు రావడం వైఎస్సార్ సీపీ తరపున వేసిన నామినేషన్లను చించివేయడంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి తీవ్ర ఆగ్రహావేశానికి గురై మైదుకూరు కూడలిలో ధర్నా చేయాల్సిన సంఘటన చోటుచేసుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలో సజావుగా జరుగుతున్న నామినేషన్ల పక్రియను మాజీ ఎమ్మెల్యే అనుచరులు నామినేషన్లను చించివేయడంతో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. కమిషనర్‌ను కలిసేందుకు అలాగే నామినేషన్లను చించివేసిన అభ్యర్థుల నామినేషన్లను తీరిగి వేయించేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే మైదుకూరు ప్రధాన రహదారిలో పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు. దీంతో అగ్రహించిన మాజీ ఎమ్మెల్యే వార్డు నామినేషన్ వేసేందుకు వచ్చిన సభ్యులు, మున్సిపాలిటీ నాయకులు అంతా కలసి అక్కడ ధర్నాకు దిగారు. సుమారు 12 గంటల నుంచి 2 గంటల పాటు మండుటెండలో ధర్నా చేపట్టారు. ఇలా దౌర్జన్యంగా రౌడీయింజం చేసి ఎన్నికల్లో నెగ్గాలని చూడటం దుర్మార్గం అని అధికారులను నిలదీశారు. నడి పోడ్డు పైసుమారు 4 గంటల పాటు ధర్న చేశారు. అనంతరం మైదుకూరు లోని వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ కార్యలయంకు వెల్లి మూడవ రోజున నామినేషన్ల పై పార్టీ కార్యకర్తలు నాయకులతో చర్చించారు.
రోడ్డు పై మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ధర్నా


