పులివెందుల రూరల్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు పరిరక్షణకు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌లు పేర్కొన్నారు. శనివారం పులివెందుల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ప్రజలు సంయమనం పాటించాలన్నారు. పులివెందులలో 144 సెక్షన్న్తోపాటు 30 యాక్ట్ అమల్లో ఉండడంవల్ల ఎవరూ కూడా గుంపులుగా నామినేషన్ కార్యాలయానికి రాకూడదన్నారు. పులివెందులలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వచ్చారన్నారు.
163 యాక్ట్ అమల్లో ఉండడంవల్ల అభ్యర్థులతోపాటు మరో ముగ్గురు మాత్రమే నామినేషన్ వేసేందుకు వెళ్లాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు చోట్ల మాత్రమే కొన్ని సంఘటనలు జరిగాయని, మిగిలిన చోట్ల ప్రశాంతంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగిందన్నారు.
డీఐజీ కోయ ప్రవీణ్, కలెక్టర్ శ్రీధర్,
ఎస్పీ నచికేత్ విశ్వనాథ్


